ఆన్ లైన్ అఫీషియల్ విడుదలకు ఒకరోజు ముందుగానే హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో ఆది పురుష్ ట్రైలర్ ని స్క్రీనింగ్ చేయడం అభిమానుల్లో విపరీతమైన ఉత్సుకతని తీసుకొచ్చింది. కేవలం ఫ్యాన్స్ కోసమేనని ముందే చెప్పడంతో దానికి అనుగుణంగానే మీడియాను అనుమతించలేదు. ప్రభాస్ స్వయంగా రావడంతో నాలుగు గంటల పదిహేను నిమిషాలకు వేయాల్సిన షో దాదాపు గంట ఆలస్యంగా మొదలయ్యింది. అయినా సరే మూవీ లవర్స్ ఓపిగ్గా ఎదురు చూశారు. త్రీడి వెర్షన్ కావడంతో అంచనాలు మాములుగా లేవు. ఇంతకీ చూసినవాళ్లేమంటున్నారు.
ట్రైలర్ మొత్తం మూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు ఉంది. సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ రావణ యుద్ధం షాట్లతో ముగించారట. ఆద్యంతం విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని, టీజర్ చూసినప్పుడు ఏదైతే నెగటివ్ ఫీలింగ్ వచ్చిందో అది పూర్తిగా తొలగిపోయేలా బ్రహ్మాండంగా కట్ చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ గురించి సంతోషం వ్యక్తమవుతోంది. ఊహించిన దాని కన్నా చాలా మిన్నగా ఉందనేది కామన్ గా వినిపిస్తున్న మాట.
సో రేపు సాయంత్రం దాకా ఎదురు చూపులకు న్యాయం జరిగేలా ఉంది. మాములుగా ఇలాంటి షోల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఎక్కువ పాజిటివ్ గానే ఉంటుంది కాబట్టి స్వయంగా ఎవరికి వారు చూస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేం. జూన్ 16న విడుదల కాబోతున్న ఆది పురుష్ మీద హైప్ ని పెంచే క్రమంలో టి సిరీస్ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు విస్తృతంగా చేయబోతోంది. రామాలయాల్లో సైతం ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేసినట్టు తెలిసింది. కృతి సనన్ సీతగా సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించిన అది పురుష్ కి ఓం రౌత్ దర్శకత్వం వహించారు
This post was last modified on May 9, 2023 6:31 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…