ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ఇటీవలే విడుదలైన వెబ్ సిరీస్ సిటాడెల్ కోసం యాక్షన్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అమెజాన్ ప్రైమ్ తెలివిగా అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి స్ట్రీమింగ్ చేయకుండా ప్రతి శుక్రవారం రెండు భాగాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంది. ఇండియన్ కరెన్సీలో సుమారు రెండు వేల కోట్లకు పైగా బడ్జెట్ ని పెట్టి సుప్రసిద్ధ రుస్సో బ్రదర్స్ తో పాటు న్యూటన్ థామస్ – జెస్సికాయులు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్ర పోషించగా రిచర్డ్ మాడెన్, స్టాన్లే టుక్సి, మ్యాన్ విల్లేలు ఇతర తారాగణం.
ఈ సిటాడెల్ కు మరో విశేషం ఉంది. ఇండియన్ వెర్షన్ ని వరుణ్ ధావన్, సమంతాల కాంబినేషన్ తో ఇక్కడ రాజ్ అండ్ డికెలు తీస్తున్నారు. దాదాపు కథా కథనాలు అన్నీ మక్కికి మక్కి ఉంటాయని సమాచారం. ఇక బేసిక్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇందులో మరీ కొత్తగా అనిపించే కథేమీ లేదు. సిటాడెల్ అనే గూఢచారి సంస్థకు చెందిన ఇద్దరు ఏజెంట్స్ ని మాంటీకోర్ అనే ప్రత్యర్థి స్పై కంపెనీ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో ఒకరు గతం మర్చిపోతారు. దేశ భద్రతకు సంబంధించిన బ్లాక్ బాక్స్ కోసం వేట మొదలవుతుంది. దీని వెనుక న్యూక్లియర్ నేపథ్యం ఉంటుంది.
చాలా గ్రాండ్ ప్రొడక్షన్ వేల్యూస్ తో తెరకెక్కించిన సిటాడెల్ తొలి రెండు ఎపిసోడ్లతో సూపర్ అనిపించుకోలేదు. గతంలో ఇలాంటివి ఎన్నో చూశామనే అభిప్రాయం పావుగంటకోసారి కలుగుతూనే ఉంటుంది. మెయిన్ స్టోరీ పాయింట్ చెప్పేశారు కాబట్టి కథనం ఎలా పరుగులు పెట్టబోతోందనేది సిటాడెల్ సక్సెస్ లో కీలకం కానుంది. మైండ్ బ్లోయింగ్ అనిపించేవి ప్రస్తుతానికి లేవు కానీ రాబోయే భాగాల్లో ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారేమో చూడాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అన్నట్టు ఆ స్థాయిలో సిటాడెల్ బోణీ జరగలేదన్నది వాస్తవం. మరి ముందు ముందు ఏమైనా థ్రిల్స్ ఉంటాయేమో వెయిట్ అండ్ సీ
This post was last modified on %s = human-readable time difference 1:29 pm
నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్…
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…