రవితేజ సినిమాని పట్టించుకోలేదు

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫట్టు మనిపించినా ఓటీటీలో హిట్టవుతాయి. అయితే తాజాగా రవితేజ నుండి వచ్చిన ‘రావణాసుర’ థియేటర్స్ లో డిజాస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా ఓపెనింగ్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొల్పింది. తర్వాత విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత ఆసక్తి పెంచింది. తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే సాదా సీదా కంటెంట్ తో థ్రిల్ చేయలేక చతికల పడింది.

తాజాగా ఈ సినిమా ఎమేజాన్ లో రిలీజైంది. సదరు ఓటీటీ సంస్థ కూడా సరైన ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్ గా రిలీజ్ చేసేశారు. ఇక రవితేజ కానీ , టీం కానీ ఎవరూ ప్రమోట్ చేయలేదు. దీంతో సినిమా ఓటీటీ లో రిలీజైన సంగతి కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. ఆప్ ఓపెన్ చేసి ఓహో నెల తిరగకుండానే రవితేజ సినిమా వచ్చేసింది అనుకుంటున్నారు తప్ప వ్యూస్ ఇవ్వడం లేదు.

ఏదేమైనా రవితేజ వంటి స్టార్ హీరో సినిమా ఓటీటీ లో రిలీజ్ అంటే అంతో ఇంతో సోషల్ మీడియాలో సందడి ఉండాలి కానీ థియేటర్స్ లో ప్రేక్షకులు పట్టించుకోని ఈ సినిమా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ లో రిలీజ్ చేసిన సంస్థ కూడా పట్టించుకోవడం లేదు అనుకుంటూ. ఇక ఇదే వారంలో నాని దసరా నెట్ ఫ్లిక్స్ లో రావడంతో రవితేజ సినిమాను ఆడియన్స్ కూడా లైట్ తీసుకుంటున్నట్టున్నారు.