Movie News

సల్మాన్‌ను ఎంత లేపాలని చూసినా..


కరోనా తర్వాత బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలిసిందే. ‘పఠాన్’ లాంటి కొన్ని సినిమాలకు మాత్రమే అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. మిగతా సినిమాలన్నీ దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. బాలీవుడ్లో ఒకప్పుడు ఫ్లాపులు, డిజాస్టర్లు లేవని కాదు. కానీ కరోనా తర్వాత పరిస్థితి బాగా సున్నితంగా తయారై.. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కూడా మినిమం ఓపెనింగ్స్ లేని పరిస్థితి తలెత్తింది. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్ల సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్లు చూసి బాలీవుడ్ బెంబేలెత్తిపోయింది.

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా పరిస్థితి ఏమవుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ సినిమా ప్రోమోలు చూసి తల పట్టుకున్న ప్రేక్షకులకు.. సినిమా చూశాక తల బొప్పి కట్టింది. హిందీ ప్రేక్షకుల పరిస్థితి ఏమో కానీ.. ఈ సినిమా చూసిన సౌత్ జనాలు, క్రిటిక్స్ బెంబేలెత్తిపోయారు. అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటి అని తీర్మానించారు. 1, 1.5 రేటింగ్స్ ఇచ్చారు. సౌత్‌లో ఎవ్వరూ కూడా 2 రేటింగ్‌కు మించి ఇచ్చింది లేదు. ఈ రోజుల్లో ఇంత ముతక సినిమా ఏంటి అంటూ సినిమాను చీల్చి చెండాడారు. హిందీలో కూడా కొందరు క్రిటిక్స్ దీన్ని చెత్త సినిమాగా తీర్మానించారు.

కానీ పేరు గొప్ప క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు మాత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ను మాస్ మసాలా ఎంటర్టైనర్, సూపర్ సినిమా అంటూ కొనియాడారు. 3 ప్లస్ రేటింగ్స్ ఇచ్చారు. సల్మాన్ మాస్ మేనియా అని.. పైసా వసూల్ సినిమా అని సినిమాను లేపాలని చూశారు. ఈ చిత్రానికి తొలి రోజు రూ.15 కోట్ల వసూళ్లే వచ్చినా, సినిమా పట్ల ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి లేదని అర్థమైనా వీళ్లు తగ్గలేదు. రెండో రోజు కలెక్షన్లు పెంచి ఫిగర్స్ వేయడం.. సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ బాగుందని.. సింగిల్ స్క్రీన్లలో ఇరగాడేస్తోందని హైప్ చేయడం చేశారు.

ఐతే సల్మాన్‌కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి వీకెండ్ వరకు సింగిల్ స్క్రీన్లలో ఓ మోస్తరుగా ఆడింది. కానీ సోమవారం సినిమా చతికిలపడింది. అయినా సదరు క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు తగ్గట్లేదు. డిజాస్టర్ అని తేలిపోయినా.. సల్మాన్ సినిమాను ఇంకా ఇంకా లేపాలనే చూస్తున్నారు. కానీ ఏం చేసినా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ పరిస్థితి మెరుగుపడేలా కనిపించడం లేదు.

This post was last modified on April 25, 2023 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

41 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

1 hour ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

1 hour ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

2 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago