పది రోజుల కిందటే శాకుంతలం అనే భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద బడ్జెట్ పెట్టి ఎంతో శ్రమకోర్చి తీసిన సినిమా ఇది. కానీ ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ వచ్చింది. ఆ టాక్ అంతకంతకూ పెరిగిందే తప్ప తగ్గలేదు. అంతే.. సినిమాకు ఓపెనింగ్స్ కూడా కరవైపోయాయి. బాక్సాఫీస్ దగ్గర మరీ దారుణమైన ఫలితాన్నందుకుందా చిత్రం. వీకెండ్లోనే ప్రభావం చూపించలేక చతికిలపడింది.
టాక్ తేడా వస్తే పరిస్థితి అంత దారుణంగా ఉంటోంది ఈ రోజుల్లో. అదే సమయంలో టాక్ బాగుండి, మంచి సినిమా అనే పేరొస్తే.. థియేటర్లకు పరుగులు పెడతారు తెలుగు ప్రేక్షకులు. ముందు బజ్ లేకున్నా సరే.. పాజిటివ్ టాక్ వస్తే నెత్తిన పెట్టుకుంటారు. ఇది చూడాల్సిన సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తే చాలు.. ఆదరణ ఊహించని స్థాయిలో ఉంటుంది. అందుకు గత శుక్రవారం రిలీజైన విరూపాక్ష చిత్రమే ఉదాహరణ.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నా సరే.. సాయిధరమ్ తేజ్ ట్రాక్ రికార్డు బాలేకపోవడం, కొన్ని వారాలుగా బాక్సాఫీస్ స్లంప్‌లో ఉండటం, ఇతర కారణాలతో ప్రి రిలీజ్ బజ్ పెద్దగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి. కానీ సినిమాకు తొలి రోజు ఉదయం ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసరికి మొత్తం కథ మారిపోయింది. సాయంత్రానికి ఫుల్స్ పడిపోయాయి. శని, ఆదివారాల్లో ప్రేక్షకులు ఈ సినిమాను విరగబడి చూశారు. సినిమా రేంజికి మించి వసూళ్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌లో సైతం విరూపాక్ష వీకెండ్లో వసూళ్ల మోత మోగించింది. సోమవారం వసూళ్లలో కొంచెం డ్రాప్ కనిపించింది కానీ.. అయినా సరే బాగానే పెర్ఫామ్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చితే ఆదరణ ఎలా ఉంటుందనడానికి విరూపాక్ష ఉదాహరణగా నిలుస్తోంది. మంచి కంటెంట్ ఇస్తే మన ఆడియన్స్ సినిమాను నెత్తిన పెట్టుకుంటారని మరోసారి రుజువైంది.
This post was last modified on April 25, 2023 6:28 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…