దిల్ రాజు కుటుంబంలో ఆయనతో పాటు సోదరుడు శిరీష్, మేనల్లుడు హర్షిత్, కూతురు హన్సిత ప్రొడక్షన్లోనే ఉన్నారు. వీళ్లే డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. ఐతే ఈ కుటుంబం నుంచి గత ఏడాది ఒక నటుడు వచ్చాడు. హీరోగా అరంగేట్రం చేశాడు. అతనే.. ఆశిష్ రెడ్డి. దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకే ఈ ఆశిష్. ‘హషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వంలో అతను హీరోగా నటించిన ‘రౌడీ బాయ్స్’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఐతే సినిమా తేడా కొట్టినా.. ఆశిష్ పెర్ఫామెన్స్‌కు మాత్రం ప్రశంసలు దక్కాయి.
తొలి సినిమా అయినప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా హుషారుగా నటించి మెప్పించాడు ఆశిష్. డ్యాన్సులు, ఫైట్లలోనూ చురుకుదనం చూపించాడు. అతణ్ని చూసి లైవ్ వైర్‌లా ఉన్నాడు అన్న కామెంట్లు చేశారు ప్రేక్షకులు. సినిమా పోయినా హీరోకు పేరొచ్చిందని సంతోషించింది దిల్ రాజు కుటుంబం.
ఇప్పుడీ కుర్రాడు ‘సెల్ఫిష్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఇది కూడా దిల్ రాజు బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లోనే తెరకెక్కుతోంది. ఐతే దీనికి సుకుమార్ రైటింగ్స్ బేనర్ కూడా తోడవుతుండటం విశేషం. సుక్కు అసిస్టెంట్ అయిన కాశి విశాల్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యులు వరుసగా హిట్లు ఇస్తుండటం.. పోస్టర్ మీద సుకుమార్ రైటింగ్స్ పేరు కనిపిస్తే ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతుండటంతో ఆశిష్‌కు ‘సెల్ఫిష్’ ఆశించిన విజయాన్నందిస్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమాలో అతడికి జోడీగా క్రేజీ హీరోయిన్ని పెట్టారు. తమిళ చిత్రం ‘లవ్ టుడే’తో యూత్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న ఇవానా ఇందులో కథానాయిక. ఆమె ఫస్ట్ లుక్‌ను తాజాగా లాంచ్ చేశారు. ‘లవ్ టుడే’ను తెలుగులో కూడా మంచి హిట్ చేశారు ఆడియన్స్. ఇవానాకు ఇక్కడ కూడా మంచి పాపులారిటీనే వచ్చింది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on April 22, 2023 9:19 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…