Movie News

సంయుక్త మళ్ళీ సిక్సర్ కొట్టింది

హీరోయిన్ల కొరత విపరీతంగా ఉన్న టాలీవుడ్ లో మీడియం రేంజ్ సినిమాలకు సంయుక్త మీనన్ బెస్ట్ ఛాయస్ గా కనిపిస్తోంది. పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్ళ పారితోషికాలు భరించలేరు. శ్రీలీల చేతిలో పదికి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. సో వీళ్ళ కన్నా రీజనబుల్ రెమ్యునరేషన్ తో సంయుక్తకు అవకాశాలు క్యూ కట్టాయి. డెబ్యూ చేసిన భీమ్లా నాయక్ లో తను చేసింది రానా భార్యగా మరీ ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు. క్లైమాక్స్ లో మాత్రమే నటనకు స్కోప్ దొరికిందే తప్ప గొప్ప క్యారెక్టర్ అయితే కాదు. అయితేనేం తెరంగేట్రంతో సక్సెస్ ఫుల్ గా బోణీ కొట్టేసింది.

కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసార ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ కావడం ఈ కేరళ కుట్టికి పెద్ద ప్లస్ అయ్యింది. కట్ చేస్తే ఏడాది తిరక్కుండానే ధనుష్ తో జట్టుకట్టిన సార్ ఏకంగా వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో హ్యాట్రిక్ సాధించిన భామలు ఈ మధ్యకాలంలో లేరు. తాజాగా సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో తళుక్కుమంది. అయితే ఇది అన్నిటికి మించి అనే తరహాలో అమ్మడి పెర్ఫార్మన్స్ కి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. గ్లామర్ టచ్ ఉన్నట్టుగా ప్రమోషన్లలో చూపించినా అసలు సినిమా చూశాక ఆడియన్స్ షాక్ అవుతున్న మాట వాస్తవం.

ఇటీవలే జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మిమ్మల్ని గోల్డెన్ లెగ్ అంటున్నారని ఒక పాత్రికేయడు అడిగినప్పుడు ఇవేవి నమ్మనని చెప్పిన సంయుక్తకు ఏదో ఒకరకంగా టైం అయితే కలిసి వస్తోంది. నెక్స్ట్ డెవిల్ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ తో రెండో సినిమా ఇది. గత ఏడాది కన్నడలో గాలిపట 2తో శాండల్ వుడ్ లాంచ్ జరుపుకున్న సంయుక్తకు అక్కడి కంటే ఇక్కడే క్రేజీ ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి. మాతృబాష మలయాళం కన్నా ఇక్కడే డిమాండ్ పెరుగుతోంది. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే సామెతను గుర్తు చేసుకుని కెరీర్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడే సెటిలవ్వొచ్చు

This post was last modified on April 21, 2023 3:30 pm

Share

Recent Posts

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

21 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

21 minutes ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

2 hours ago

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

3 hours ago

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

4 hours ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

6 hours ago