ఒకప్పుడు కమర్షియల్ మార్కెట్ లో మంచి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాబట్టుకునే స్థాయిలో ఉన్న మాచో స్టార్ గోపిచంద్ ను గత కొన్నేళ్లుగా పరాజయాల వెంటాడుతున్నాయి. ఏ దర్శకుడితో చేసినా కనీసం యావరేజ్ దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తనతో మూడుసార్లు జట్టు కట్టిన దర్శకుడు శ్రీవాస్ తో చేతులు కలిపి రామబాణంతో వస్తున్నాడు. వచ్చే నెల 5న విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ మీద మెల్లగా బజ్ పెరుగుతోంది. మాస్ లో ఇమేజ్ ని తిరిగి వెనక్కు తెచ్చుకునే నమ్మకంతో గోపీచంద్ ఉన్నాడు. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది.
కథేంటో గుట్టు దాచకుండా చెప్పేశారు. విదేశాల నుంచి ఒక ముఖ్యమైన పని మీద వస్తాడో యువకుడు(గోపీచంద్). నాణ్యమైన తిండి మంచి సమాజానికి దారి తీస్తుందని నమ్మి ఫుడ్డు బిజినెస్ లో ఉండే అన్నయ్య(జగపతిబాబు)కు చేదోడు వాదోడుగా ఉండటం మొదలుపెడతాడు. అయితే కెమికల్స్ కలిపి ప్రజల ప్రాణాలతో ఆడుకునే పోటీదారు(తరుణ్ ఆరోరా) వల్ల వీళ్ళ ఫ్యామిలీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. అన్నీ పనులు మాటలతోనే జరగవని గుర్తించి చేతలతో శత్రువులకు సమాధానం చెప్పడం షురూ చేస్తాడు. లక్ష్మణుడిలా ఉండే వాడు రామబాణం ఎలా అయ్యాడనేది స్టోరీ.
వీడియో మొత్తం టిపికల్ గోపీచంద్ మసాలా స్టైల్ లో ఉంది. శ్రీవాస్ ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, మాస్ అంశాలు, గ్లామర్ అన్నీ కలగలిపి ఈ రామబాణం రూపొందించినట్టు కనిపిస్తోంది. డింపుల్ హయాతి హీరోయిన్. చాలా గ్యాప్ తర్వాత భూపతిరాజా కథనందించడం విశేషం. రెగ్యులర్ ఫార్ములాలో కనిపిస్తున్నప్పటికీ కంటెంట్ కనక టైం పాస్ చేయిస్తే గోపిచంద్ కి చాలా గ్యాప్ తర్వాత హిట్ పడ్డట్టే. మే 5న అల్లరి నరేష్ ఉగ్రంతో పాటు థియేటర్లలో అడుగు పెడుతున్న రామబాణం గురి ఎలా కుదురుతుందో ఇంకో రెండు వారాల్లో తేలిపోతుంది.
This post was last modified on April 21, 2023 6:20 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…