Movie News

రానా నాయుడు 2 ఇంకాస్త ఘాటుగా

మార్చిలో నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైన వెబ్ సిరీస్ రానా నాయుడు మీద ఎన్ని విమర్శలు వచ్చినా అది సదరు ఓటిటి ప్లాట్ ఫార్మ్ మీద వారాల తరబడి టాప్ పొజిషన్ లో ఉన్న మాట వాస్తవం. వెంకటేష్ లాంటి హోమ్లీ హీరోని ఇలాంటి బూతు కంటెంట్ లో చూడాల్సి రావడం పట్ల తెలుగు ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ నార్త్ ఆడియన్స్ తో పాటు ఓవర్సీస్ జనాలు దీన్ని బ్రహ్మాండంగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ మేరకు చిన్న టీజర్ తో కూడిన ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని నెట్ ఫ్లిక్స్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం ఈసారి రానా నాయుడు 2 ఇంకాస్త ఘాటుగా ఉంటాడట. దీని షూటింగ్ మొదటి భాగంతో పాటుగా ఇంతకు ముందే తీశారట. అయితే ఈసారి రాబోయే ఎపిసోడ్లలో బూతులు, అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల యధాతథంగా ఉంచాలా లేక ఏమైనా డోస్ తగ్గించాలా అనే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మన ఫ్యామిలీ జనాలు ఇప్పటికీ రానా నాయుడుని చూడని వాళ్ళు కోట్లలో ఉన్నారు. కనీసం వాళ్ళ కోసమైనా ఈసారి ఏమైనా మారుస్తారేమో అనుకున్నారు కానీ చూస్తుంటే ఆ సూచనలేం లేనట్టే.

రానా నాయుడు సక్సెస్ తో నెట్ ఫ్లిక్స్ మరికొన్ని సిరీస్ లను దక్షిణాదిలోని బడా హీరోలతో ప్లాన్ చేస్తోంది. సినిమాలకు మించిన రెమ్యునరేషన్లు ఆఫర్ చేస్తూ డిమాండ్ చేస్తే ఇంకా ఎక్కువ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతోందట. 2023లో రాబోతున్న భారీ తెలుగు తమిళ చిత్రాల నాన్ థియేట్రికల్ హక్కులను వందల కోట్లు పోసి కొన్న ఈ సంస్థ ఇకపై అంతర్జాతీయ స్థాయిలో బోల్డ్ స్టోరీస్ ని ఎంత ఖర్చైనా సరే తీసేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. ఫస్ట్ సీజన్ ప్రమోషన్లో అన్నట్టు రానా ఈసారి కూడా పెద్దలకు మాత్రమేనని మరింత నొక్కి వక్కాణించి చెబుతాడేమో.

This post was last modified on April 19, 2023 12:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

2 minutes ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

1 hour ago

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…

1 hour ago

ఆ సినిమాల నుంచి నన్ను తీసేశారు – అక్షయ్

బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…

2 hours ago

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…

2 hours ago

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…

2 hours ago