పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజిలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త వారం క్రితమే లీకైనప్పటికీ కొన్నిసార్లు చివరి నిమిషంలోనూ మార్పులు ఉంటాయి కాబట్టి అలాంటి ట్విస్టు ఏమైనా ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అదేమీ లేకుండా సాఫీగా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మొన్నటి నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇందులో పవన్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ సుజిత్ దీన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారట.
ఇక ప్రియాంకా మోహన్ కి జాక్ పాట్ తగిలినట్టే. గతంలో చేసిన నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ డబ్బింగ్ మూవీస్ శివ కార్తికేయన్ డాక్టర్-డాన్, సూర్య ఈటిలు ఇక్కడ బాగానే ఆడాయి. వాటిలో లుక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే సరైన ఆఫర్ కోసం ఎదురు చూసిన ప్రియాంకకు ఓజి రూపంలో కనక బ్లాక్ బస్టర్ పడితే ఇక్కడ అవకాశాలు క్యూ కడతాయి. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బోలెడుంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నల జోరు తగ్గాక శ్రీలీల తప్ప స్టార్ హీరోలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
అందుకే ఓజి సక్సెస్ కావడం తనకు చాలా కీలకం. ముంబై నుంచి తిరిగి వచ్చాక పవన్ హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొంటాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ని సమాంతరంగా ప్లాన్ చేశారు కానీ అది వచ్చే నెల నుంచి ఉండొచ్చు. వినోదయ సితం రీమేక్ తాలూకు పాట ఒక్కటి ఫినిష్ చేసి డబ్బింగ్ చెప్పేస్తే దానికి సంబంధించిన టెన్షన్ పవన్ కు ఉండదు. గతంలో గ్యాంగ్ స్టర్ గా నటించిన పంజా తాలూకు గాయాలు దీంతో పూర్తిగా మాసిపోవాలని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2024 వేసవి కన్నా ముందు ఈ ఓజి విడుదలయ్యే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.
This post was last modified on April 19, 2023 12:23 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…