Movie News

మైత్రి మూవీ మేక‌ర్స్‌-సుకుమార్ ఇళ్ల‌పై ఐటీ దాడులు

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన సంచ‌ల‌న మూవీ.. పుష్ప‌ నిర్మాతలు, ద‌ర్శ‌కుడి ఇళ్లు, ఆఫీసుల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు ఏక‌కాలంలో దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని నిర్మాత‌, ద‌ర్శ‌కుల ఇళ్లు, కార్యాల‌యాల‌కు వ‌చ్చిన ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి.. దాడులు చేస్తున్న‌ట్టు తెలిసింది. దాడుల విష‌యాన్ని అత్యంత ర‌హ‌స్యంగా ఉంచారు.

పుష్ప.. ది రైజ్‌ సినిమా గ‌త ఏడాది బాక్సాఫీసుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన విష‌యం తెలిసిందే. ఎలాంటి అంచ‌నా లు లేకుండానే తెర‌కెక్కిన ఈ సినిమా అనూహ్య విజ‌యాన్ని న‌మోదు చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ సార‌థ్యంలో నిర్మాత‌లు నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ లు పుష్ప‌-1 మూవీని నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను యువ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

175-200 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో తీసిన పుష్ప‌-1 క‌లెక్ష‌న్ల‌లో దూసుకుపోయింది. ఏకంగా.. 350 – 420 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టిన‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇక‌, ఇటీవ‌లే దీనికి సీక్వెల్ గా తీస్తున్న పుష్ప ది రూల‌ర్‌(పుష్ప‌-2) ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇది కూడా అంచ‌నాలు మ‌రింత‌గా పెంచేసింది. ఈ ఏడాదిలో ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇదిలావుంటే.. పుష్ప -2 ట్రైల‌ర్ విడుద‌లైన వారంలోనే ఐటీ అధికారుల క‌న్ను ఈ మూవీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడిపై ప‌డింది.

ఈ రోజు(బుధ‌వారం) ఉద‌యం.. వారి కార్యాల‌యాలు, ఇళ్ల‌పై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌ధానంగా విచార‌ణ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఆదాయ వ్య‌యాల‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా పుష్ప – 2 బ‌డ్జెట్ ను కూడా అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పుష్ప నిర్మాత‌లు ద‌ర్శ‌కుడి ఇంటిపై ఐటీ దాడుల వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on April 19, 2023 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైఎస్’ల వార‌స‌త్వం కోసం జ‌గ‌న్ ఆరాటం!

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఓ ప్ర‌శ్న…

16 minutes ago

బన్నీ నిర్ణయం కరెక్టని ఋజువైనట్టే

ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…

57 minutes ago

హీరోలు సాధార‌ణ మ‌నుషులే.. మ‌రిచిపోతున్నారు: త‌మ్మారెడ్డి

ద‌ర్శ‌కుడు, న‌టుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. ఆయ‌న ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడ‌తారు.. ఏం…

2 hours ago

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌కు హైకోర్టు ఊరట

తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…

2 hours ago

ఆర్ఆర్ఆర్ : మేకింగ్ అఫ్ మాస్టర్ పీస్!

ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…

2 hours ago

చొక్కా విప్పి కొరడాతో కొట్టుకున్న అన్నామలై

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల…

2 hours ago