పవర్ స్టార్ అనే అర్ధం పర్ధం లేని సినిమా తీసి పవన్ కళ్యాణ్ కి ఏదో ఫేవర్ చేసినట్టు చెప్పుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు అల్లు అనే సినిమా అనౌన్స్ చేసి మరీ ఓవర్ చేస్తున్నాడని అవతలి హీరోల అభిమానులతోను అనిపించుకుంటున్నాడు. అయితే ఇది కేవలం గిల్లడానికే చేస్తున్న పని అని అందరికీ స్పష్టంగా అర్ధమవుతోంది. తన సినిమాల గురించి మెగా ఫ్యామిలీ స్పందిస్తే వ్యూస్ వస్తాయని వర్మ ఆరాటం.
పవన్ పట్టించుకోలేదు కనుక అల్లు ఫ్యామిలీలో ఎవరైనా స్పందిస్తారని చూస్తున్నాడేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అయినా ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు కనుక అతని గురించి సినిమా తీసినా ఒక అర్ధం ఉంది. కానీ మూసేసిన ప్రజారాజ్యం గురించి, దాంట్లో అల్లు అరవింద్ పాత్ర గురించి ఇప్పుడు సినిమా దేనికి? కేవలం వాళ్ళను రెచ్చగొట్టడం మినహా ఇది పూర్తిగా అప్రస్తుతం.
అల్లు ఫ్యామిలీ లేదా చిరు ఫ్యామిలీ వాళ్ళెవరైనా డైరెక్ట్ గా గడ్డి పెడితే తప్ప ఆగడేమో అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి ఈసారైనా వర్మను పట్టించుకుంటరా లేదా ఎప్పటిలా కొండ, కుక్క అంటూ త్రివిక్రమ్ డైలాగులతో సరిపెడతారా?
This post was last modified on August 3, 2020 7:54 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…