అక్కినేని లాంటి స్టార్ లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా ఆచితూచి సినిమాలు చేస్తున్న అఖిల్ ఇప్పటిదాకా సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేసుకుంటూ వచ్చాడు. డెబ్యూ మూవీ ఫాంటసీనే అయినప్పటికీ అది కూడా ప్రేమ కథే. ఇండస్ట్రీకి వచ్చిన ఆరేళ్ళ తర్వాత కంప్లీట్ యాక్షన్ అవతారంలోకి మారిపోయి చేసిన మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఏజెంట్. భారీ బడ్జెట్ తో సుమారు మూడేళ్ళ దాకా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం మీద అభిమానులు ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకున్నారు. ఇందాకా కాకినాడలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ అంగరంగ వైభవంగా జరిగిపోయింది.
దేశ భద్రతకు సంబంధించిన మిషన్ కోసం ప్రాణాలకు తెగించి విదేశాలకు వెళ్లి శత్రువులతో పోరాడే ఏజెంట్(అఖిల్)కు భయమనేది ఉండదు. తన ఉనికిని చూపకుండా చిలిపితనం అరాచకం రంగరించి ముష్కరుల ఆట కట్టించడం అతని స్టైల్. గురువు(మమ్ముట్టి)గా భావించే వ్యక్తి శిక్షణలో రాటు తేలతాడు. అయితే అనూహ్య పరిణామాలు ఇతని మీద ద్రోహి అనే ముద్రపడేలా చేస్తాయి. అయినా భయపడకుండా ఏం చేశాడన్నది తెరమీద చూడాలి. అఖిల్ ని ఎంత ఊహించుకుంటారో మీ ఇష్టం అన్న నిర్మాత మాటలు నిజమే అనిపించింది.
రెండు నిమిషాల ఇరవై సెకండ్లున్న వీడియోలో దర్శకుడు సురేందర్ రెడ్డి విజువల్స్ ని చాలా ఇంటెన్స్ తో నింపేశారు. తెలుగులో స్పై డ్రామాలు కొత్తేమీ కాకపోయినా ఇంత డెప్త్ ఉన్న బ్యాక్ డ్రాప్ ఏజెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఊహకందని విధంగా ఉంది. ముఖ్యంగా ఫైటింగ్ బ్లాక్స్ మతులు పోయేలా వచ్చాయి. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం, హిప్ హాప్ తమిజా సంగీతం కంటెంట్ స్థాయిని పెంచాయి. ఏప్రిల్ 28 విడుదలకు కావాల్సిన హైప్ మొత్తాన్ని ఒక్కసారిగా తెచ్చేసిన ఫీలింగ్ ట్రైలర్ లో ఉంది. ఇంతే స్థాయిలో కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ మీద గన్ ఫైరింగే.
This post was last modified on April 18, 2023 9:51 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…