మావయ్య పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ తో సముతిరఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సితం రీమేక్ తాలూకు కీలక భాగం షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. పవన్ టాకీ పార్ట్ ఎప్పుడో ఫినిష్ చేశారు. ఒక పాట చిత్రీకరణ పెండింగ్ ఉంది కానీ సమయానుకూలాన్ని బట్టి తీయాలా వద్దానేది తర్వాత నిర్ణయించబోతున్నారు. ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేకుండా స్క్రిప్ట్ ప్లాన్ చేశారట. ఇక దీని టైటిల్ గురించి పలురకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. పవన్ తేజుల మొదటి అక్షరాలాను కలిపి ప్రస్తుతానికి హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు.
దేవర, దేవుడు అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయనే టాక్ నెలక్రితమే వచ్చింది. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే సినిమా రిలీజయ్యాక టైటిల్ పెట్టే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం. నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వప్రసాద్ సూచనప్రాయంగా ఓ ఇంటర్వ్యూలో ఇది చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నిజానికి ఇలాంటి ప్రయోగం గతంలో పవన్ రేంజ్ స్టార్ హీరో చేయలేదు. 1998లో జెడి చక్రవర్తి, మీనా జంటగా ఓ మూవీని ముందు పేరు లేని సినిమాగా రిలీజ్ చేశారు. తర్వాత ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు తీసుకుని పాపే నా ప్రాణంని ఫిక్స్ చేసి పబ్లిసిటీ చేశారు.
అప్పట్లో మీడియాలో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. తర్వాత మళ్ళీ ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఒక మల్టీ స్టారర్ కి ఇలాంటి ఆలోచన చేయడం సాహసమే. నిజంగా ఇలా చేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ విడుదలకు ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి తాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు సమకూరుస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశామని సాయిధరమ్ తేజ్ చెప్పడం చూస్తుంటే ఫ్యాన్స్ ఊహించని కంటెంటే ఉండబోతోంది.
This post was last modified on April 18, 2023 1:36 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…