బడ్జెట్ ఎంత అన్నది వెల్లడి కాలేదు కానీ.. ఇండియాలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అతి పెద్ద బడ్జెట్ ‘శాకుంతలం’దే అని చెప్పుకున్నాడు రిలీజ్ ముంగిట దర్శక నిర్మాత గుణశేఖర్. కానీ అంత ఖర్చు పెట్టిన సినిమాకు రిలీజ్ ముంగిట సరైన బజ్ తీసుకురాలేకపోయారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయింది. విడుదల ముంగిట చేసిన ప్రమోషన్ల హడావుడి కూడా సరిపోలేదు.
తొలి రోజు డల్లుగా మొదలైన సినిమాకు నెగెటివ్ టాక్ పెద్ద డ్యామేజే చేసింది. అసలే లేడీ ఓరియెంటెడ్ సినిమా.. పైగా బజ్ తక్కువ.. దీనికి తోడు నెగెటివ్ టాక్.. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలుస్తుంది. తొలి రోజు వసూళ్లతోనే సినిమాకు పరాభవం తప్పదని తేలిపోయింది. శని, ఆదివారాల్లో కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. దీంతో పాటుగా రిలీజైన డబ్బింగ్ సినిమా ‘విడుదల’ పరిస్థితే మెరుగ్గా ఉంది.
అంతకుమించి ‘శాకుంతలం’ టీంకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రెండు వారాల ముందు రిలీజైన ‘దసరా’ సినిమాకు తెలంగాణలో ‘శాకుంతలం’ కంటే ఎక్కువ షేర్ వస్తుండటం. ఏరియా ఏదైనా సరే సమీపంలో దసరా, శాకుంతలం ఆడుతున్న థియేటర్ల కలెక్షన్లను పరిశీలిస్తే.. ‘దసరా’కే ఎక్కువ కలెక్షన్లు ఉంటున్నాయి.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శనివారం ప్రతి షోకూ ‘శాకుంతలం’తో పోలిస్తే 50-60 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టే ‘శాకుంతలం’ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం కూడా సినిమా ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక వీకెండ్ అయ్యాక షేర్ నామమాత్రంగా ఉండబోతోందన్నది స్పష్టం. సినిమా థియేట్రికల్ రన్ ముగియడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. ఇదేదో మామూలు సినిమా అయితే సరేలే అనుకోవచ్చు. కానీ గుణశేఖర్ ఇన్నేళ్లలో సంపాదించిందంతా ఈ సినిమా మీద పెట్టేయడమే బాధాకరం.
This post was last modified on April 16, 2023 4:48 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…