పవన్ కళ్యాణ్ తన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారంలో ముగిసింది.
ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు.
మరియు పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.నాయిక శ్రీలీల తో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.
మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉంది. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలకు మించి అలరిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదిరిపోయే డైలాగ్స్ మరియు స్పెల్-బైండింగ్ మ్యానరిజమ్‌లతో పవన్ కళ్యాణ్‌ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో నిండిన కథతో ఈ చిత్రం భారీస్థాయిలో రూపొందుతోంది. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అయనంకా బోస్, ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ ఇలా అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది.
గబ్బర్ సింగ్ కోసం మెమరబుల్ ఆల్బమ్ ని అందించిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
This post was last modified on April 16, 2023 1:52 am
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎదురుకున్న ఇబ్బందులు, వేరొకరితో నేపధ్య సంగీతం…
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయం.. నాలుగు రోజులు కూడా తిరగక ముందే బుట్టదాఖలైంది. ఇది…
ఇటీవలి కాలంలో ఏపీలో సుబ్బారాయుడు పేరు పలుమార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేడర్ కు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు ఏదో…