Movie News

మొదటి రోజే వసూళ్ల వడదెబ్బ

విజువల్ గ్రాండియర్ గా తెగ పబ్లిసిటీ చేస్తూ వచ్చిన శాకుంతలం ఫలితం దర్శక నిర్మాతలకే కాదు అభిమానులకూ షాక్ ఇచ్చేలా ఉంది. దానికి మొదటి రోజు వసూళ్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఫస్ట్ డే గ్రాస్ కేవలం 4 కోట్ల 70 లక్షలు మాత్రమేనట. షేర్ రూపంలో చూసుకుంటే 2 కోట్ల 22 లక్షల దాకా తేలుతుంది. ఇది మాములుగా చిన్న బడ్జెట్ సినిమాలకు డీసెంట్ ఫిగర్. కానీ ప్యాన్ ఇండియా రేంజ్ లో హంగామా చేసి వివిధ భాషల్లో ఒకేరోజు గ్రాండ్ రిలీజ్ జరుపుకున్న శాకుంతలం స్థాయికి ఏ మాత్రం సరితూగని నెంబర్లు ఇవి.

ఇందులో సగం తెలుగు రాష్ట్రాల నుంచి రాగా అడ్వాన్స్ బుకింగ్స్ పుణ్యమాని ఓవర్సీస్ లో డెబ్భై లక్షల దాకా వసూలు కావడం కొంత ఊరట కలిగించింది. ఇప్పుడొచ్చిన టాక్ కి పికప్ ఆశించడం కష్టమే కానీ వీకెండ్ ని ఏ మేరకు వాడుకుంటుందనే దాన్ని బట్టి నష్టాల శాతం పెరగడం తగ్గడం ఆధారపడి ఉంది. థియేట్రికల్ హక్కులను 18 కోట్ల దాకా అమ్మారట. అంటే దీనిపైనా ఇంకో కోటి వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కాదు. కానీ పరిస్థితులు చూస్తే ఇది అసాధ్యమే. ఎందుకంటే అంత మొత్తం రావాలంటే ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావాలి. పది రోజులు స్ట్రాంగ్ రన్ కొనసాగాలి.

శాకుంతలం విషయంలో అన్నీ ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. సామ్ అనారోగ్యంతో రెండు రోజులు ముందే ప్రమోషన్లకు చెక్ పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ మీట్ లు పెట్టినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా దాని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. పైగా తెలంగాణలో మితిమీరిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో మల్టీప్లెక్సుల టికెట్ ధరలు గరిష్టంగా 295 రూపాయలతో పాటు అదనంగా 35 రూపాయలు త్రీడి చార్జీలు పెట్టేయడంతో ఇప్పుడిది బూమరాంగ్ లా రివర్స్ అయ్యేలా ఉంది. అలా అని తక్కువ రేట్లున్న ఏపిలో కలెక్షన్ల వర్షం కురవడం లేదు కానీ నైజామ్ ఎఫెక్ట్ మాత్రం తీవ్రంగా ఉంటుంది.

This post was last modified on April 15, 2023 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

9 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

11 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

12 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

13 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

13 hours ago