గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రాబోతుంది. మైథాలాజికల్ డ్రామాతో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ప్రమోషన్స్ లో పాల్గొంటూ వచ్చింది సమంత. అనారోగ్యం నుండి కోలుకోవడంతో మీడియా ముందు కాస్త యాక్టివ్ గా కనిపించింది.
అయితే ఈ సినిమాకు రెండ్రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. చూసిన అందరూ సమంత నటన గురించి చెప్తున్నారు. శకుంతల దేవిగా సామ్ ఆకట్టుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరో లేరు. దుష్యంత్ మహారాజ్ గా నటించిన మలయాళం హీరో దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. దీంతో శాకుంతలం కి ఓపెనింగ్స్ తెచ్చే భారమంతా సమంత పైనే పడింది.
ఓ బేబీ , యశోద సినిమాలతో సమంత మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మూడు, నాలుగు రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ అనాలసిస్ తోనే ఇప్పుడు గుణ శేఖర్, దిల్ రాజు ధీమాగా ఉన్నారు. ఏదేమైనా ఈ సినిమాకి ప్రేక్షకులను తీసుకొచ్చే మొత్తం భాద్యత సమంత మీదే ఉంది. మరి సమంతను నమ్ముకొని ఈ భారీ బడ్జెట్ 3d సినిమా తీసిన గుణ శేఖర్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ?
This post was last modified on April 12, 2023 4:23 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…