టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె ని దర్శకుడు నాగ అశ్విన్ ఎంత ప్యాషన్ తో తీస్తున్నాడో చూస్తున్నాం. సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ బయటికి రాకుండా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మేకింగ్ వీడియోలు అప్పుడప్పుడు వదలుతూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా రైడర్స్ పేరుతో 71 సెకండ్లున్న చిన్న బైట్ ని విడుదల చేసింది. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, రైడర్స్ అంటే ఎవరు, హీరో ప్రభాస్ వాళ్ళతో ఏం చేయబోతున్నాడనే ఆసక్తికరమైన ప్రశ్నలు వదిలి అంతర్లీనంగా వాటికి సంబంధించిన క్లూస్ ఇచ్చారు.
వాటిని డీకోడ్ చేస్తే తేలేదేంటంటే రైడర్స్ అంటే విలన్ చుట్టూ ఉండే సూపర్ న్యాచురల్ గ్యాంగ్. మాములు మనుషులు కాదు. అవెంజర్స్ తరహాలో అతీత శక్తులతో తమ బాస్ ని కాపాడుతూ ఉంటాడు. వాడు చేసే దుర్మార్గాలను కాచుకుంటూ ఆదేశించడం ఆలస్యం ఎంత విధ్వంసమైనా సరే తెగబడతారు. ఈ గెటప్పులకు సంబంధించిన దుస్తులు మాస్కులు చాలా విచిత్రంగా ఉన్నాయి. హాలీవుడ్ స్టైల్ లో వాటికి ఏ మాత్రం తీసిపోని రీతిలో వీటిని సిద్ధం చేసిన విజువల్స్ ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 2 పేరుతో వచ్చిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది
ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతోందన్న వార్తకు ఇప్పుడు బలం చేకూరింది. 2024 జనవరి 12 విడుదల చేస్తామని వైజయంతి మూవీస్ ఇప్పటికీ ప్రకటించింది కానీ నిజంగా ఆ డేట్ కి కట్టుబడి ఉంటారానే అనుమానం ఇంకా తొలగిపోలేదు. సలార్ తో పాటు ఇది కూడా రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారం కూడా ఊపందుకుంది. దీపీకా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ విజువల్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 10, 2023 12:43 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…