టాలీవుడ్ లోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లతో ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతూ వేల కోట్ల పెట్టుబడితో దూసుకుపోతోంది. అయితే ఖరీదైన చీర మీద మసాలా మరకలు పడితే దాని విలువ తగ్గిపోయిన తీరుగా. చిన్న చిత్రాల విషయంలో మైత్రి అనుసరిస్తున్న ధోరణి క్రమంగా ఈ దిశగానే తీసుకెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న విడుదలైన మీటర్ కు యునానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఎంత ఆ సంస్థ సిఓఓకు మద్దతుగా భాగస్వామ్యం తీసుకున్నా ఫలితంలో వాటా మైత్రికీ చెందుతుంది.
ఇదే కాదు గత ఏడాది సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తీసిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన హ్యాపీ బర్త్ డే ఎంత పెద్ద ఫ్లాపో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క మత్తు వదలరా మాత్రమే సేఫ్ బెట్ అయ్యిందే తప్ప మిగిలినవన్నీ తేడా కొట్టినవే. వీటికయ్యే బడ్జెట్ ఖర్చు తక్కువే కావొచ్చు. డిజిటల్ శాటిలైట్ తదితర హక్కుల ద్వారా లాభాలే వచ్చి ఉండొచ్చు. కానీ అంతిమంగా బాక్సాఫీస్ రిజల్ట్ నే కొలమానంగా చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే.
సురేష్ ప్రొడక్షన్స్ సైతం ఒకప్పుడు ఇదే సమస్యతో ఇబ్బంది పడి ఆదాయంతో సంబంధం లేకుండా వర్కౌట్ కావని అర్థమైన చిన్న సినిమాలను తీయడం ఆపేసింది. రామానాయుడుగారు కాలం చేశాక సురేష్ బాబు తన నిర్ణయాల విషయంలో క్యాలికులేటెడ్ గా ఉండటం మొదలుపెట్టారు. ఇప్పుడు మైత్రికి ఇలాంటి చేంజోవర్ అవసరమనిపిస్తోంది. పుష్ప 2 ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్, ఖుషి, జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇలా ఇంత భారీ లైనప్ పెట్టుకుని రిస్క్ లేదనే కారణం చూపి చిన్న సినిమాలకు టెంప్ట్ అయితే అది బ్రాండ్ ఇమేజ్ కే ఇబ్బందిగా మారుతుంది.
This post was last modified on April 8, 2023 11:31 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…