ప్రతి ఫిలిం ఇండస్ట్రీలోనూ ఒక తరంలో ఆధిపత్యం చలాయించిన హీరోలంతా ఒక దశ దాటాక సీనియర్లు అయిపోయి నెమ్మదిగా ఫాలోయింగ్ తగ్గడం.. యువతరం జోరు పెరగడం మామూలే. టాలీవుడ్లో కూడా అదే జరుగుతోంది. చిరు తరం హీరోలతో పోలిస్తే తర్వాతి తరం హీరోలదే ఇప్పుడు ఆధిపత్యం. బాలీవుడ్లో ఈ స్థాయిలో యువ హీరోలు హవా సాగించట్లేదు కానీ.. సీనియర్ల జోరు తగ్గుతున్న మాట మాత్రం వాస్తవం.
ఆమిర్ ఖాన్, అక్షయ్ లాంటి సీనియర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. షారుక్ కూడా కొన్నేళ్లు స్లంప్ చూశాడు కానీ ఈ ఏడాది ‘పఠాన్’తో పుంజుకున్నాడు. ఇప్పుడిక సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీకి జాన్’ సినిమాతో ఎలాంటి ఫలితం రాబడతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త తరం హీరోల జోరు గురించి స్పందించాడు. వాళ్లను పొగుడుతూనే కౌంటర్లు కూడా వేశాడు. ఇంతకీ సల్మాన్ ఏమన్నాడంటే..
“యంగ్ హీరోలు బాగానే కష్టపడుతున్నారు. వారికి సినిమా అంటే ప్యాషన్ ఉంది. వాళ్ల భవిష్యత్ ప్రణాళికలు కూడా బాగున్నాయి. కానీ మేమంతా (సల్మాన్, షారుఖ్, ఆమిర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్) సీనియర్లం అయిపోయామని వాళ్లు అనుకుంటున్నారు. కానీ మేం అన్ని రకాల సినిమాల్లో నటిస్తాం. ఏ సినిమానూ వదులుకోం. యంగ్ హీరోలు ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకూ పారితోషకాలు పెంచేస్తారు” అని సల్మాన్ వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యలు బీటౌన్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇక సల్మాన్ కొత్త చిత్రం విషయానికి వస్తే.. ఇది తమిళ ‘వీరం’ చిత్రానికి రీమేక్. తెలుగులో ఇదే సినిమా ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ అయి డిజాస్టర్ అయింది. హిందీ వెర్షన్‌కు బాగా మసాలాలు అద్దినట్లు కనిపిస్తున్నా రిజల్ట్ మీద సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్, రామ్ చరణ్ క్యామియోలు చేయడం విశేషం. పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
This post was last modified on April 6, 2023 7:08 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…