తెలంగాణ జన జీవనంలో బ్రతుకమ్మ సాంప్రదాయానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఆడపడుచు ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. మంత్రులతో మొదలుపెట్టి సామాన్య గృహిణుల దాకా అంతగా భాగమైన ఈ వేడుకను అప్పుడప్పుడు సినిమాల్లో చూపించడం పరిపాటి. అందులోనూ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో నైజామ్ ప్రాంతపు భాషను, యాసను, సెంటిమెంట్లను ఆధారంగా చేసుకుని ఎన్నో చిత్రాలు వస్తున్నాయి.
బలగం అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి కారణం ఈ నేటివిటీని దర్శకుడు వేణు సరిగ్గా వాడుకోవడమే. ఇప్పుడిది బాలీవుడ్ దాకా వెళ్లిపోయింది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ వచ్చే నెల రంజాన్ పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 21 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇందులో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర చేయడంతో తెలుగు మార్కెట్ ని నిర్మాతలు గట్టిగా టార్గెట్ చేశారు. అందులో భాగంగానే బ్రతుకమ్మ మీద ఒక పాట పెట్టేసి డబ్బింగ్ కాకుండా స్ట్రెయిట్ వెర్షన్ ఆడియో రికార్డు చేయించి మరీ షూట్ చేశారు. వెంకీతో పాటు భూమిక, పూజా హెగ్డే, రోహిణి హట్టంగడి తదితరుల లిప్ సింక్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. క్యాస్టింగ్ మొత్తం సాంగ్ లో ఉంది
ఈ పాటను కంపోజ్ చేసింది కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ కావడం విశేషం. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు(ఒరిజినల్ వీరం) రీమేక్ అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. టీజర్ గట్రా చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది కానీ కేవలం లైన్ మాత్రమే తీసుకుని చాలా మార్పులే చేశారట. వెంకటేష్ ఉండటం వల్ల దీని తెలుగు వెర్షన్ ని భారీ ఎత్తున మార్కెటింగ్ చేయబోతున్నారు. ఎప్పటి నుంచో బాలీవుడ్ హిట్టు కోసం తపించిపోతున్న పూజా హెగ్డేకి దీని సక్సెస్ చాలా కీలకం. గత ఏడాది సౌత్ లోనూ వరస డిజాస్టర్లు పడ్డాయి మరి
This post was last modified on March 31, 2023 2:48 pm
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…