Movie News

ఆమిర్ అన్నారు.. షారుఖ్ అన్నారు.. చివరికి

బయోపిక్స్ తీయడంలో బాలీవుడ్ ఫిలిం మేకర్ల స్టయిలే వేరు. ఇందులో మంచి నైపుణ్యం సాధించి.. ఎన్నో క్లాసిక్స్ అందించారు. భారీ విజయాలందుకున్నారు. ఈ కోవలోనే చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి కొన్నేళ్ల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. ముందుగా ఈ చిత్రానికి కథానాయకుడిగా వినిపించిన పేరు ఆమిర్‌ ఖాన్‌దే. అతను కూడా సానుకూలంగానే కనిపించాడు. కానీ కారణాలేంటో తెలియదు కానీ అతడి స్థానంలోకి షారుఖ్ వచ్చినట్లు అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని నిర్మించనున్న యూటీవీ పిక్చర్స్ అధినేత సిద్దార్థ్ రాయ్ కపూర్ కూడా గతంలో ఇందులో షారుఖే హీరో అని ధ్రువీకరించాడు. ఈ చిత్రానికి ‘సెల్యూట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు చెప్పుకున్నారు. ఇది రెండేళ్ల కిందటి మాట.

కానీ తర్వాత రకరకాల మార్పులు జరిగాయి. షారుఖ్ ఈ సినిమా చేయలేనంటూ తప్పుకునేశాడు. తర్వాత రణబీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. అతనూ ఖరారవ్వలేదు. ఆపై విక్కీ కౌశల్ పేరు వినిపించింది. కానీ అతనూ ఓకే చేయలేదు. చివరికిప్పుడు డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్‌తో ఈ సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. ఇంతకుముందు అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’లో ఫర్హాన్ అదరగొట్టాడు. మరోసారి అలాంటి సవాల్ స్వీకరించడానికి ఫర్హాన్ రెడీ అయ్యాడు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, బ్రోకెన్ థ్రెడ్ లాంటి గొప్ప సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మహేష్ మథాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది యూటీవీ పిక్చర్స్. వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టబోతున్నారట.

This post was last modified on July 30, 2020 9:20 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago