తాజాగా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని ఫ్యామిలీస్ తో కలిసి చూడొద్దని రానా ముందే చెప్పినప్పటికీ యథాలాపంగా చూసేసిన కుటుంబాలు ఉన్నాయని సోషల్ మీడియా రియాక్షన్లను బట్టి అర్థమవుతోంది.
ఇలాంటి కంటెంట్ లో రానా నటించడం పట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నెగటివ్ తో కూడుకుని సోలో హీరోగా దాకా తను అన్ని రకాల పాత్రలు ట్రై చేశాడు. ప్రత్యేకంగా వందల కోట్ల మార్కెట్ అంటూ ఏదీ లేదు. వర్సటైల్ నటుడు అనే పేరు తెచ్చుకున్నాడు.
కానీ వెంకటేష్ సంగతి వేరు. ముప్పై అయిదేళ్ల సుదీర్ఘ అనుభవమున్న దగ్గుబాటి నట అగ్రతార వెంకటేష్ ఇలా చేయడం పట్లే అందరి కంప్లయింట్. బాబాయ్ మీద వస్తున్న కామెంట్లు గమనించిన రానా డ్యామేజ్ రిపేర్ పనిలో పడ్డాడు. ట్విట్టర్ లో ఈ సిరీస్ మీద వ్యక్తమవుతున్న అభిప్రాయాలు అభ్యంతరాలు ఒక్కొక్కటి గమనిస్తూ ముఖ్యమైన వాటికి సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటివి చేయోద్దని వాళ్ళ మాటలను గౌరవిస్తూనే ఇందులో బూతుని అసభ్యతను లాజికల్ గా సమర్థిస్తున్న వాళ్ళను కరెక్టేగా అంటూ ప్రోత్సహిస్తున్నాడు.
అతిగా మాత్రం సమర్ధించుకోవడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రానా నాయుడు సెకండ్ సీజన్ కు ఆల్రెడీ బాబాయ్ అబ్బాయ్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఫీడ్ బ్యాక్ ని ఆధారంగా చేసుకుని కొన్ని కీలక మార్పులు చేయమని దర్శకులు కరణ్ అంశుమన్ – సుపర్న్ వర్మలకు సూచించినట్టు తెలిసింది. అధిక శాతం అభిమానులు సైతం రానా నాయుడు పట్ల హ్యాపీగా లేరు. మరి వీటిని పరిగణనలోకి తీసుకుంటారో లేక ఫస్ట్ సీజన్ తోనే ముగింపు పలుకుతారో చెప్పలేం. నెగటివ్ అయినా సరే ఇంత రెస్పాన్స్ చూశాక నెట్ ఫ్లిక్స్ ఇక్కడితో ఆగుతుందా
This post was last modified on March 12, 2023 12:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…