టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు రోజుల కిందట ఒక ప్రెస్ మీట్లో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీశాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని.. ఆ డబ్బు ఇస్తే 8-10 సినిమాలు తీసి ఇచ్చేవాళ్లమని ఆయన ఎద్దేవా చేశారు. ఐతే ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినిమాను ఆస్కార్ అవార్డుల కొంత బడ్జెట్ పెట్టి ప్రమోట్ చేస్తే తప్పేంటని.. అయినా ఆ బడ్జెట్ రూ.80 కోట్లని ఎవరు చెప్పారు అంటూ ఆయన గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.
రాజమౌళి గురువు అయిన లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సహా పలువురు తమ్మారెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ జాబితాలోకి మెగా బ్రదర్ నాగబాబు కూడా చేరారు. ఆయన కూడా తమ్మారెడ్డిని కౌంటర్ చేస్తే ఒక ట్వీట్ వేశారు.
కాకపోతే ఆ ట్వీట్లో భాగంగా నాగబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి లాగడం తమ్మారెడ్డిని చాలా పెద్ద మాట అనేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. “To Whomever It May Concern : “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం).. ఇదీ నాగబాబు ట్వీట్. ఐతే ఆయన విమర్శించాలంటే తమ్మారెడ్డిని నేరుగా విమర్శించవచ్చు కానీ.. మధ్యలో వైసీపీ వారి భాష అంటూ నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ భాష అంటూ తమ్మారెడ్డిని అంత మాట అనడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విమర్శ వైసీపీ వాళ్లు ఎవరైనా చేసి ఉంటే.. వాళ్లకు వైసీపీ భాషలోనే సమాధానం అంటూ నాగబాబు ఇలా కౌంటర్ వేసి ఉంటే బాగుండేదని.. కానీ తమ్మారెడ్డిని వైసీపీ భాషలో తిట్టడం ఏంటని అంటున్నారు నెటిజన్లు. తమ్మారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘సార్’ సినిమాను కొనియాడుతూ జగన్ సర్కారు ఏపీలో స్కూళ్లను బాగు చేస్తున్నట్లుగా మాట్లాడిన నేపథ్యంలో ఆయన్ని వైసీపీ మద్దతుదారుగా భావించి నాగబాబు ఇలా అని ఉండొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on March 10, 2023 2:48 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…