మేడమ్ జీ … మరీ ఇంత ఓవర్ యాక్షనా?

శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకించి న్యూస్ కవరేజ్ ఏమీ ఉండదిపుడు. ఎందుకంటే ఆమె చేతిలో సినిమాలేవీ లేవు. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టే బికినీ ఫోటోలు మాత్రమే అడపాదడపా వెబ్ సైట్లలో పెడుతూ ఉంటారు. అయితే ఆమె గురించి తరచుగా బిగ్ బాస్ షోకి వెళుతోందని మాత్రం న్యూస్ లో వినిపిస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ షోకి ఫలానా వాళ్ళు వెళుతున్నారని మీడియాలో గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. అదేమంత తప్పు విషయమో, అవమానకరమో కాదు. ఈ ఏడాది ఒక కంటెస్టెంట్ గా శ్రద్ధ వెళుతోందని రూమర్స్ వచ్చాయి. వాటికి రియాక్ట్ అవుతూ అలాంటిదేమి లేదని, ఇంకోసారి ఇలాంటి ప్రచారం చేస్తే కేసు పెడతానని ఆమె బెదిరించింది.

ఎవరితో అయినా అఫైర్ ఉందనో, లేదా మరేదైనా ఇమేజ్ డామేజ్ చేసే విషయాల గురించి రాంగ్ న్యూస్ రాస్తేనో శ్రద్ధ ఇంత రియాక్షన్ ఇచ్చినా అర్ధం ఉంది. తనగురించి అసలు న్యూసే లేనపుడు… తానొకరు ఉన్నదని గుర్తు చేసే ఇలాంటివి కూడా రాయవద్దంటే ఎలా?