బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ .. రీజన్ అదే !

అల్లు అర్జున్ ఓ క్రేజీ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయబోతున్నట్లు మేకర్స్ తో కలిసి ప్రకటించాడు బన్నీ. ఎప్పటి నుండో ఈ కాంబోలో సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇప్పుడు మెటీరియలైజ్ అయింది. ఈ కాంబో సినిమాను టీ సిరీస్ భూషణ్ తో కలిసి ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నాడు.

సినిమా ఘాట్ ఎప్పుడు ? అసలు బన్నీ కి ఇది ఎన్నో ప్రాజెక్ట్ లాంటి డీటైల్స్ ఏమి చెప్పలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు కంగారు పడటానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. బన్నీ ఇలా హడావుడి చేసి ఎనౌన్స్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్ళకుండానే క్యాన్సిల్ అయ్యాయి. అందులో లింగుస్వామి , కొరటాల శివ సినిమాలున్నాయి.

అప్పట్లో చెన్నై వెళ్ళి మరీ లింగుస్వామి డైరెక్షన్ లో బై లింగ్వళ్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేసుకొచ్చాడు బన్నీ. ఆ సినిమా నెల తిరిగే లోపే అటకెక్కింది. ఈ మధ్యే కొరటాల శివతో కూడా బన్నీ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఇద్దరు కలిసి సముద్రపు ఒడ్డున నిలబడి మరీ సినిమాను ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. ఆచార్య తర్వాత బన్నీతో కాకుండా ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్తున్నాడు కొరటాల.

ఇవన్నీ చూస్తే బన్నీకి ఎనౌన్స్ మెంట్స్ పెద్దగా అచ్చిరానట్టు కనిపిస్తుంది. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో ఓ ఫ్యామిలీ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగా చేతిలో ‘యానిమల్’ బాలీవుడ్ సినిమా ఉంది. తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. అంటే మరో రెండు ,మూడేళ్లు సందీప్ బిజీ. ఇక బన్నీ కూడా పుష్ప 2 ఫినిష్ చేయాల్సి ఉంది. తర్వాత త్రివిక్రమ్ సినిమాకు ఇంకా టైమ్ పట్టవచ్చు. మరి ఆ తర్వాత లెక్కలు మారితే ఈ కాంబో సినిమా ఉండక పోవచ్చు. అందుకే ఇప్పటి నుండే బన్నీ -సందీప్ సినిమా ఉంటుందా ? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతున్నాయి.