హైదరాబాదులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా యావత్ టాలీవుడ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పటివరకు సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించాలని కంకణం కట్టుకున్న మెగాస్టార్, రాజమౌళి వంటి దిగ్గజాలు కూడా.. కామ్ గా ఇంటికే పరిమితమైపోయారు.
ఈ తరుణంలో కొంతమంది హీరోలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే.. ఇక వారి కుటుంబం సమక్షంలో మాత్రమే అంతా జరుగుతుందని అందరూ ఆశించారు. అయితే రాను రాను మనోళ్ళు కరోనాకు పెద్దగా భయపడట్లేదని అంటున్నారు చూపరులు.
నిజానికి కరోనా ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ తరహాలో చాలామంది రావడమే కాదు, చాలామందికి నయం అయిపోతోంది కూడా. అలాగే సదరు వైరస్ న మనం తేలికగా తీసుకోలేం కాని, మన టాలీవుడ్లో మాత్రం నిధానంగా జనాలు భయపడటం అనేది తగ్గుతోందట. ముఖ్యంగా హీరోలు ఒక్కరొక్కరుగా భయాన్ని పక్కనపెడుతున్నారని నితిన్ పెళ్ళికి వచ్చిన గెస్టులను చూస్తుంటే తెలుస్తోంది.
వరుణ్ తేజ్, కార్తికేయ, సాయిధరమ్ తేజ్ మొదలగు హీరోలు అలాగే హైదరాబాదులోనే ఉంటున్న కొందరు హీరోయిన్లు నితిన్ పెళ్ళికి వెళ్ళినట్లు టాక్ వస్తోంది. చక్కగా మాస్కు పెట్టుకుని చేతిలో శానిటైజర్ బాటిల్ పెట్టుకుని వీళ్లు నితిన్ కు కంగ్రాట్స్ చెప్పడానికి ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారట.
ఆల్రెడీ కొందరు స్టార్లు పార్టీలు మొదలుపెట్టేశారు. కొందరేమో మీటింగులు కూడా పెడుతున్నారు. ఇక కొందరు షూటింగులు కూడా పెడుతున్నారు కాని ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెనకంజ వేస్తున్నారు. షూటింగుల పరిస్థితి అటుంచితే, తదుపరి రానా పెళ్ళికి అలాగే నిహారిక ఎంగేజ్మెంట్ కు ఎంతమంది వస్తారో చూడాలి మరి.
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…