Movie News

వెంకీ నోట ఆ బూతులు తట్టుకోగలమా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అత్యంత ఆకర్షించేది ఎవరంటే మరో ఆలోచన లేకుండా విక్టరీ వెంకటేష్ పేరు చెప్పేయొచ్చు. ఆయనకు కుటుంబ ప్రేక్షకుల్లో ముందు నుంచి గొప్ప ఆదరణ ఉంది. లేడీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉంటారు ఆయనకు. కెరీర్లో వెంకీ ఎక్కువ సినిమాలు చేసింది, పెద్ద పెద్ద హిట్లు కొట్టింది కుటుంబ కథా చిత్రాలతోనే. అందుకే ఆయన అభిమాన వర్గంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ఆయన సినిమాలు కుటుంబ సమేతం చూసేలా క్లీన్ ఎంటర్టైన్మెంట్‌తో తెరకెక్కుతుంటాయి. బూతులకు, అశ్లీల సన్నివేశాలకు వెంకీ చిత్రాల్లో చోటు ఉండదు. యాక్షన్ సినిమాలు చేసినా.. అందులోనూ అసభ్యతకు చోటు లేకుండా చూసుకుంటాడు వెంకీ. అలాంటి హీరో ఇప్పుడు వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే సిరీస్ చేశాడు.

తాజాగా ‘రానా నాయుడు’ ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూస్తే యాక్షన్, థ్రిల్లర్ ప్రియులకు మంచి ట్రీట్ ఖాయమని అర్థమవుతోంది. కానీ బాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లో ఉండే అడల్ట్స్ ఓన్లీ అంశాలు కూడా ఇందులో ఉణ్నాయి. ఇంటిమేట్ సీన్లు, బూతులకు ఇందులో లోటు లేనట్లే ఉంది. హిందీ ఒరిజినల్స్‌లో చాలా కామన్ అనదగ్గ బూతులను వెంకీ కూడా అందుకున్నాడు. అలవోకగా బూతులు పలికేశాడు. కానీ ఆ డైలాగులు చెప్పేటపుడు ఆయనెలా ఫీలయ్యాడో కానీ.. వెంకీ ఫ్యాన్స్‌కు మాత్రం ఏదోలా అనిపించింది.

ఈ బూతులు హిందీ ప్రేక్షకులకు మామూలుగా అనిపించవచ్చేమో కానీ.. ఈ సిరీస్‌ను తెలుగులోకి అనువదించినపుడు ఆ బూతులను కూడా యాజిటీజ్ తర్జుమా చేస్తే మాత్రం కష్టమే. వెంకీ నోట అలాంటి బూతులు విని మన వాళ్లు తట్టుకోవడం కష్టమే. మరి ఒరిజినల్లో ఉన్న ఎసెన్స్ దెబ్బ తినకూడదని ఆ బూతుల్ని అలాగే కొనసాగిస్తారా.. లేక వెంకీ ఫ్యాన్స్ మనోభావాలు, తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని వాటిని పరిహరించి వేరే పదాలు పెడతారా అన్నది చూడాలి.

This post was last modified on February 16, 2023 1:01 pm

Share

Recent Posts

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

7 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

6 hours ago