తమిళంలో ఎంత గొప్ప గుర్తింపు ఉన్నా తెలుగులో ఆడపాదడపా హిట్లు కొడుతున్న ధనుష్ కు రఘువరన్ బిటెక్ తర్వాత ఆ స్థాయి హిట్టు లేదు. మధ్యలో నవ మన్మథుడు లాంటివి ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకున్నా కోలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ గా చెప్పుకునే వడ చెన్నయ్, అసురన్, కర్ణన్ లు ఇక్కడ డబ్బింగ్ కాకపోవడం ఫ్యాన్స్ ఇప్పటికీ వెలితిగా ఫీలవుతూ ఉంటారు. అందుకే ఈసారి మన మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేశాడు ధనుష్. సితార లాంటి పెద్ద సంస్థ, వెంకీ అట్లూరి లాంటి పక్కా టాలీవుడ్ డైరెక్టర్ తో జట్టు కట్టి సార్ గా రాబోతున్నాడు. ఇందాకే హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది
ఎందులోనూ రానంత డబ్బు ఒక్క విద్యా రంగంలోనే వస్తుందని గుర్తించిన మేకతోలు బిజినెస్ మెన్(సముతిరఖని) కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు నడుపుతూ ఉంటాడు. స్వార్థంతో సర్కారీ బడులను దత్తత తీసుకుని తన స్టాఫ్ ని అక్కడికి పంపిస్తాడు. అతని ఉద్దేశాలు తెలియని వాళ్ళలో ఓ మంచి టీచర్(ధనుష్) ఉంటాడు. ఓ పల్లెటూరికి డ్యూటీ మీద వెళ్తాడు. అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని ఎన్నో కుటుంబాలు పిల్లలను చదువు కోసం పంపడం లేదని అర్థం చేసుకుని రంగంలోకి దిగుతాడు. స్వంత యజమానినే ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ యుద్ధంలో ఎలా గెలిచాడు అనేదే స్టోరీ
కథను చక్కగా అరటిపండు ఒలిచినట్టు రెండున్నర నిమిషాల వీడియోలో క్లియర్ గా చూపించారు. ఎంత స్కూల్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా వెంకీ అట్లూరి అన్నీ పొందుపరిచాడు. ముఖ్యంగా ఇది అనువాద రూపంలో కాకుండా రెండు భాషలకు విడివిడిగా షూట్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఫ్రెష్ గా ఉండగా యువరాజ్ ఛాయాగ్రహణం రిచ్ నెస్ కి తోడైంది. వచ్చే 17న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథతో పాటు అల వైకుంఠపురములో రీమేక్ షెహజాదాతో సార్ పోటీ పడబోతున్నాడు
This post was last modified on February 8, 2023 10:04 pm
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి…
హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా…
ఒకప్పుడు కామెడీ సినిమాలంటే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశాడు.…
వెంకటేష్ ప్రేమంటే ఇదేరాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి ఆల్బమ్ తోనే సూపర్ హిట్ కొట్టిన సంగీత దర్శకుడు రమణ గోగులకు…
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు నైతిక విలువల సలహాదారుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు,…
ప్రతిసారి అమెరికా పౌరసత్వం పొందే విదేశీయుల సంఖ్యలో భారతీయుల వాటా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…