ఆచార్య సినిమా షూటింగ్ త్వరగా ముగించేస్తే వేరే ప్రాజెక్టులతో బిజీ కావాలని కొరటాల శివ చూస్తున్నాడు. లాక్ డౌన్ విధించిన సమయంలో మళ్ళీ షూటింగ్ చేయడానికి చిరంజీవి చాలా ఉత్సాహం చూపించారు. అయితే కరోనాని తేలికగా తీసుకోలేమని తేలిపోవడంతో ఆయన ఇప్పట్లో షూటింగ్ కి వచ్చే మూడ్ లో లేరు.
కనీసం ఆగష్టు నుంచి చిరు అందుబాటులోకి వస్తారని కొరటాల శివ ఎదురు చూస్తోంటే… ఇప్పుడు షూటింగ్ చేసే మూడ్ అసలు లేదని చిరంజీవి చెప్పకనే చెప్పేసారు. క్లీన్ షేవ్ చేసేసుకుని చిరంజీవి ఒళ్ళు తగ్గించడానికి సమయం వెచ్చిస్తున్నారు. ఆచార్య షూట్ మొదలు కావాలంటే కంటిన్యూటీ సమస్యలు రాకుండా చిరంజీవి మునుపటి రూపు రేఖలకు రావాలి.
ఇప్పటి చిరంజీవి లుక్ చూస్తుంటే ఆయనకు దగ్గరలో షూట్ మొదలు పెట్టే ఆలోచన అస్సలు లేనట్టు స్పష్టమయిపోతోంది. చిరు ఇలా లుక్ మార్చేస్తే చరణ్ గడ్డం పెంచేశాడు. ఆర్.ఆర్.ఆర్. కోసం మెలి తిరిగిన మీసాలతో కనిపిస్తున్న చరణ్ కూడా షూట్ కి సిద్ధమైనపుడే మళ్ళీ గెటప్ మారుస్తాడేమో. మొత్తానికి మన హీరోలంతా ఇంకా రిలాక్సింగ్ మూడ్ లోనే ఉన్నారని క్లియర్ అయిపొయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates