కళాతపస్వి కే. విశ్వనాథ్ శకం ముగిసింది. ఆర్థశతాబ్దం పైగా కళామ్మతల్లి సేవలో తరించి, తొమ్మిది పదులు దాటిన వయసులో విశ్వనాథ్ కమనీయ లోకాలకు తరలి వెళ్లారు. సినీ ప్రియులు, ఆయన వల్లే ఫేమ్ పొందిన వారు వెక్కి వెక్కి ఏడ్వగా.. వెళ్లొస్తా, మళ్లీ వస్తా అని చెప్పి సినీ వినీలాకాశంలో ధృవతారగా మిగిలిపోయారు. 50కి పైగా సినిమాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించగా అందులో దాదాపు అన్ని సూపర్ హిట్ చిత్రాలే. శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయం కృషి, సాగర సంగమం, శృతిలయలు మచ్చుతునకలు…
సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు
విశ్వనాథ్ అంత్యక్రియలు హైదరాబాద్లోనే సంప్రదాయం ప్రకారం జరిగాయి. అయితే ఇతర బ్రాహ్మణ సంప్రదాయంలో పార్థివ దేహాన్ని దహనం చేస్తారు. తర్వాత అస్తికలను గంగా, గోదావరి, కృష్ణా నదుల్లో నిమజ్జనం చేస్తారు. విశ్వనాథ్ పార్థివ దేహాన్ని మాత్రం కూర్చోబెట్టి ఖననం చేశారు.
విశ్వనాథ్ పూర్వీకులు కర్ణాటక నుంచి వచ్చిన వీరశైవ ఆరాధ్యులుగా తెలుస్తోంది. వారికి ప్రత్యేక సంప్రదాయాలు ఉన్నాయని చెబుతున్నారు. వాళ్లు లింగధారులు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వీళ్లు ఎక్కువగా కనిపిస్తారు. అయితే కాలక్రమేణా నియోగి బ్రాహ్మలతో వివాహ బంధాలు ఏర్పరచుకుని అందరితో కలిసిపోయారు.
ఇష్టలింగ ధారణ
వీర శైవులను స్థానికంగా లింగధారులని కూడా పిలుస్తారు. వారు ఇష్ట లింగ ధారణ చేస్తారు. చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియల సమయంలో దేహంపై ఉన్న శివలింగాన్ని తొలగించకూడదంటారు. శవదహనం చేస్తే శివలింగం కూడా కాలిపోతుంది. అందుకే శివలింగం చెక్కుచెదరకుండా ఉండేందుకు వారిని ఖననం చేస్తారు. కే, విశ్వనాథ్ విషయంలో కూడా జరిగిందీ అదేనని చెబుతున్నారు.
ఎస్పీ అంత్యక్రియలు కూడా..
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం చనిపోయినప్పుడు కూడా ఆయనకు ఆరాధ్య శైవుల సంప్రదాయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఖననం చేశారు. నిజానికి ఎస్పీకి విశ్వనాథ్ అన్నయ్య వరుస అవుతారు. అప్పుడు ఎస్పీ, ఇప్పుడు విశ్వనాథ్‌కు ఒకే పద్ధతిలో అంత్యక్రియలు జరిగాయి. ఆరాధ్యుల ఆచారాల గురించి కనీస పరిజ్ఞానం లేనివారు మాత్రం అంత్యక్రియలలో పార్థివ దేహాన్ని పాతిపెట్టటం హిందువులకు అరిష్టదాయకమని ప్రచారం చేస్తుంటారు. అది ముమ్మాటికి నిజం కాదు….
This post was last modified on February 3, 2023 9:15 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…