Movie News

శ‌ర్వానంద్.. అది క్యాన్సిల్ ఇది ఓకే

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ కెరీర్ కొన్నేళ్లుగా ఒడుదొడుకుల మ‌ధ్య సాగుతోంది. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో స‌త‌మతం అయిన అత‌ను.. గ‌త ఏడాది చివ‌ర్లో ఒకే ఒక జీవితంతో కాస్త ఉప‌శ‌మ‌నం పొందాడు. ఈ సినిమా కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద స‌క్సెస్ ఏమీ కాలేదు కానీ.. ఫెయిల్యూర్ కూడా కాక‌పోవడం శ‌ర్వాకు సంతోషాన్నిచ్చింది.

ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే శ‌ర్వా.. లిరిసిస్ట్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌చైత‌న్య‌తో ఓ సినిమాను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. నితిన్‌తో క్యాన్సిల్ అయిన ప‌వ‌ర్ పేట‌నే శ‌ర్వాతో కృష్ణ‌చైత‌న్య తీయ‌బోతున్న‌ట్లు అప్పుడు వార్త‌లు వ‌చ్చాయి. ఐతే త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా ఆగిపోయింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ప్రాజెక్టులో శ‌ర్వా స్థానంలోకి విశ్వ‌క్సేన్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఆ సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చిన శ‌ర్వా.. ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును లైన్లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అత‌ను సినిమాటోగ్రాఫ‌ర్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడ‌ట‌. త‌మిళంలో హ్యాపీడేస్ రీమేక్‌తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన గుహ‌న్.. ఆపై తెలుగులో 118 మూవీతో హిట్టు కొట్టాడు. కానీ త‌ర్వాత త‌న‌పై పెరిగిన అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. హైవే, డ‌బ్ల్యూడ‌బ్ల్యూ, డ‌బ్ల్యూ చిత్రాల‌తో నిరాశపరిచాడు. ఇప్పుడ‌త‌ను శ‌ర్వాకు ఒక థ్రిల్ల‌ర్ కథ చెప్పి ఒప్పించాడ‌ట‌. ఈ సినిమాను నిర్మించ‌డానికి అగ్ర నిర్మాత దిల్ రాజు ముందుకు వ‌చ్చాడ‌ట‌.

మొత్తానికి కాంబినేష‌న్ బాగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మ‌రోవైపు శ‌ర్వాకు యంగ్ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్యతోనూ ఒక క‌మిట్మెంట్ ఉంది. ముందు గుహ‌న్ సినిమా చేశాకే ఆదిత్య సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు శ‌ర్వా. ఇటీవ‌లే ర‌క్షితా రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న శ‌ర్వా.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడు.

This post was last modified on January 31, 2023 10:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

59 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

9 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

10 hours ago