ఈ లాక్ డౌన్ లో అయ్యప్పనుమ్ కోశియుమ్ అనే మలయాళ సినిమా రీమేక్ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి. అయితే అందులో చాలా వరకు నిజం కాలేదు. కాకపోతే ఈ సినిమా పట్ల మన హీరోలు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. పురుషాహంకారం అంశంతో రూపొందిన సదరు మలయాళ చిత్రంలో ఇద్దరు హీరోల పాత్రలు నువ్వా, నేనా అన్నట్టుంటాయి. అందుకే బాలకృష్ణ. వెంకటేష్ చేయడం లేదని తెలియగానే రవితేజ అడిగి మరీ చేస్తానని చెప్పాడట. రవితేజ, రానాతో ఓకే అయిపోయిందనే అనుకున్నారు కానీ ఇప్పుడో కొత్త ట్విస్ట్ వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ రీమేక్ చేయడానికి ఒక బడా స్టార్ ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్. ఒకవేళ అతను ఈ సినిమా చేసేట్టయితే అన్ని లెక్కలు మారిపోతాయి. అటువైపు హీరో కూడా మారాల్సి రావచ్చు. అలాగే దర్శకుడిగా ఎవరైనా ప్రముఖుడు రావచ్చు. మలయాళంలో ఒక మాదిరి బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగులో బడా ప్రాజెక్ట్ గా మారేట్టుంది. ఇదిలావుంటే ఈ సినిమాను ఇప్పటికే చాలామంది తెలుగు వాళ్ళు చూసేసిన నేపథ్యంలో తెలుగు వెర్షన్ పై ఎంత ఆసక్తి ఉంటుందనేది ఆసక్తికరం.
This post was last modified on July 22, 2020 12:46 am
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…