బాహుబలి, సాహో, రాధే శ్యామ్ కోసం ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేసిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా నాలుగైదు సినిమాలు ఒకేసారి లైన్ లో పెట్టేసి ఏ స్టార్ హీరో లేనంత బిజీగా షూటింగులలో తలమునకలై ఉన్నాడు. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు ప్లానింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ దీని కోసం ప్రణాళికల్లో ఉంది. ఒక వేళ మిస్ అయితే యష్ రాజ్ బ్యానర్ కు వెళ్లే అవకాశముంది. అయితే కేవలం ఓవర్ ది టాప్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప కథా కథనాల మీద అంత దృష్టి పెట్టడనే కంప్లయింట్ సిద్దార్థ్ ఆనంద్ మీద ఉంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ దానికి ఉదాహరణలు.
తాజాగా పఠాన్ వచ్చింది. ఈ మూడూ కమర్షియల్ స్కేల్ లో చాలా పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. స్టార్ పవర్ ని సరిగ్గా వాడుకుని ఎలివేషన్లతో డ్రామాను పండించే తీరు సిద్దార్థ్ ఆనంద్ కి అవకాశాలు తెచ్చి పెడుతోంది. ఇతని నెక్స్ట్ మూవీ హృతిక్ రోషన్ తో జరుగుతోంది. టైటిల్ ఫైటర్. ఈ ఏడాది లోపు షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ చేసుకున్నారు. ఇదయ్యాక ప్రభాస్ తో సినిమా చేయాలనేది సిద్దార్థ్ ఆనంద్ ఆలోచన. ముందైతే హృతిక్ ప్రభాస్ లను కలిపి వార్ 2 తీయాలనుకున్నాడు కానీ ఆ ఇద్దరి డేట్లు కథకు సంబంధించిన చిక్కుల వల్ల కాంబో సాధ్యపడలేదు. దీంతో ఫైటర్ సోలో అయ్యాడు.
ఇప్పుడీ ఫలితాలన్నీ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో నమ్మకం పెరిగింది. కానీ సాహో తాలూకు అనుభవాలు ఇంకా మర్చిపోలేదు. అదిరిపోయే యాక్షన్ విజువల్స్, బోలెడంత కథ ఉన్నా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. దాన్ని హ్యాండిల్ చేయడంలో సుజిత్ పడ్డ తడబాటు వల్ల రిజల్ట్ తేడా కొట్టింది. కానీ సిద్దార్థ్ ఆనంద్ కి ఆ ఇబ్బంది లేదు. ఇలాంటివి డీల్ చేయడంలో తన నైపుణ్యం మూడు సార్లు ఋజువు చేసుకున్నాడు కాబట్టి ప్రభాస్ నిశ్చితంగా అతన్ని నమ్మేయొచ్చు. ఆది పురుష్, సలార్, మారుతి సినిమా, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ ఇవన్నీ పూర్తయ్యాకే ఈ ప్యాన్ ఇండియా మూవీ పట్టాలెక్కొచ్చు.
This post was last modified on %s = human-readable time difference 6:09 am
బహుశా నిఖిల్ కెరీర్ లోనే తక్కువ సౌండ్ తో వస్తున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నవంబర్ 8 విడుదలలో…
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…
ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…