Movie News

48 ఏళ్ల వ‌య‌సులో సెగ‌లు

క‌స్తూరి అని నిన్న‌టిత‌రం న‌టి. కొన్ని సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించిన‌ప్ప‌టికీ అంత‌గా పేరు రాలేదు. వాటితో పోలిస్తే భార‌తీయుడులో చేసిన చెల్లెలి పాత్ర‌తోనే ఆమె ఎక్కువ పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత ఎక్కువ‌గా ఆమెకు అలాంటి పాత్ర‌లే వ‌చ్చాయి. దీంతో కెరీర్ ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. ఐతే సినిమాలు త‌గ్గిపోయాక పెళ్లి చేసుకుని కుటుంబ జీవితంలో ప‌డిపోయిన ఆమె.. కొన్నేళ్ల కింద‌ట సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

సినిమాల‌కు దూరంగా ఉన్న టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవ‌గాహ‌న పెంచేందుకు బిడ్డ‌కు పాలిస్తుండ‌గా స్థ‌నాలు క‌నిపించేలా తీసిన ఒక ఫొటో షూట్‌తో ఆమె సంచ‌ల‌నం రేపింది. అప్ప‌ట్లో ఇది హాట్ టాపిక్. క‌ట్ చేస్తే.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక క‌స్తూరి బోల్డ్ రోల్స్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతోంది. 40 ప్ల‌స్ వ‌య‌సులో కొన్ని త‌మిళ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసిన క‌స్తూరికి ఇప్పుడు 48 ఏళ్లు. ఇప్పుడు కూడా ఆమె బోల్డ్ ఇమేజ్ కోస‌మే ప్ర‌య‌త్నిస్తోంది.

తాజాగా క‌స్తూరి స్విమ్ సూట్‌తో పూల్‌లోకి దిగి ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల‌తో పంచుకుంది. అందులో ఆమె హాట్ హాట్‌గా క‌నిపించ‌డం చూసి ఈ వ‌య‌సులో ఇంత సెక్సీగా ఉందేంటి అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఇమేజ్ కోసం యుక్త వ‌య‌సులో ప్ర‌య‌త్నించి ఉంటే.. ఇలాగే హాట్ హాట్‌గా క‌నిపించి ఉంటే క‌థానాయిక‌గా ఆమె మంచి రేంజికి వెళ్లేద‌ని.. ఎక్కువ సినిమాలే చేసేద‌ని నెటిజన్లు అంటున్నారు. మ‌రి ఇప్పుడు ఆమె ప్ర‌య‌త్నం ఎంత‌మేర ఫ‌లిస్తుందో చూడాలి.

This post was last modified on January 25, 2023 9:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

39 minutes ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

43 minutes ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

50 minutes ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

2 hours ago

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి…

2 hours ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

2 hours ago