మైత్రి మూవీ మేకర్స్ లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ కి సమంత హెల్త్ కారణం చేత కాస్త పెద్ద బ్రేక్ పడింది. ఇప్పటికే రెండు నెలలపైనే బ్రేక్ వచ్చేసింది. ఫిబ్రవరి నుండి సమంత ఘాట్ లో పాల్గొననుందని అంటున్నారు కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సమంత ఫిట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా కనిపిస్తుంది. ఆమె ఆరోగ్య పరంగా పూర్తిగా కొలుకున్నాకే ఘాట్ లో జాయిన్ అయ్యే ఆలోచనలో ఉంది.
ఇక విజయ్ కి ‘లైగర్’ తర్వాత ‘ఖుషి’ రూపంలో బిగ్ బ్రేక్ వచ్చేసింది. ఇప్పటికే చాలా రోజులు బ్రేక్ తీసుకున్న విజయ్ తాజాగా మైత్రి నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నాడని తెలుస్తుంది. ఫిబ్రవరి నుండి ఖుషి ఘాట్ మొదలు కాకపోతే తను గౌతం తిన్ననూరి మూవీకి సంబందించి ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకొస్తానని చెప్తున్నాడట.
విజయ్ దేవరకొండ ఒత్తిడితో మైత్రి నిర్మాతలు సమంతను ఫిబ్రవరి నుండి షూటింగ్ కి ఒప్పించే పనిలో ఉన్నారట. ఫిబ్రవరిలో సమంత ‘శాకుంతలం’ కి సంబంధించి ప్రమోషన్ చేయాల్సి ఉంది. తన పాన్ ఇండియా సినిమా కోసం సమంత కొన్ని రోజులు ఓపిక తెచ్చుకొని ప్రమోషన్స్ చేయనుందని తెలుస్తుంది. ఎక్కువ ప్రదేశాలు కాకపోయినా చెన్నై , ముంబై, బెంగళూర్ వెళ్ళే ప్లానింగ్ లో ఉందట. సామ్ ‘శాకుంతలం’ రిలీజ్ తర్వాతే ‘ఖుషి’ కి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు విజయ్ సమంత డేట్స్ కోసం వెయిట్ చేస్తాడా లేదా గౌతం తిన్ననూరి సినిమాకి షిఫ్ట్ అవుతాడా ? చూడాలి.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…