Movie News

హానీ రోజ్ దృష్టి టాలీవుడ్ మీదే

ఇటీవలే సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డిలో పెద్ద బాలయ్యకు మరదలిగా జైసింహారెడ్డికి తల్లిగా రెండు పాత్రల మధ్య విపరీతమైన వ్యత్యాసమున్నప్పటికీ మెప్పించిన హానీ రోజ్ మెల్లగా టాలీవుడ్ లోనే కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది.

నిజానికి అఖండలోనే తను హీరోయిన్ గా నటించాల్సింది. కొంత స్క్రీన్ టెస్ట్ చేశాక దర్శకుడు బోయపాటి శీనుకి సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఆమె స్థానంలో ప్రగ్య జైస్వాల్ ని తీసుకున్నారు. అయితే హానీలో విషయముందని గుర్తించిన మైత్రి మేకర్స్, గోపిచంద్ మలినేనిలు తనను బాలయ్య పక్కన జోడిగా లాక్ చేశారు. కట్ చేస్తే శృతి హాసన్ కన్నా తనకే ఎక్కువ గుర్తింపు దక్కింది

ఫస్ట్ హాఫ్ లో తెల్లబడ్డ జుత్తుతో కనిపించినా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గ్లామర్ రోల్ లో బాగానే మెప్పించింది. అందుకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ని హానీ రోజ్ నే తీసుకోవాలనే ప్రతిపాదన మొదట వచ్చింది.

అయితే కాజల్ అగర్వాల్ కూడా బెటర్ ఛాయస్ గా ఫీలవుతున్న అనిల్ ఇంకా ఈ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదని వినికిడి. వీళ్ళ కన్నా ముందు త్రిష, హ్యూమా ఖురేషిలను ట్రై చేసినప్పటికీ ఏవో కారణాల వల్ల వాళ్ళు నో చెప్పేశారు. వీలైనంత త్వరగా ఎన్బికె 108కి హీరోయిన్ ని లాక్ చేయాల్సి ఉంది.

ఎప్పుడో 2005 మలయాళంలో లాంచ్ అయిన హానీ రోస్ అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది కానీ తెలుగు ఎంట్రీకి మాత్రం పదిహేడేళ్లు పట్టింది. వయసు మరీ లేత కాకపోయినా అందాల అరోబోత విషయంలో పెద్దగా మొహమాటపడదని పేరుంది. వీరసింహారెడ్డిలో ఆ అవకాశం లేకపోయినా చేయబోయే వాటిలో ఏదైనా గ్లామర్ షో ఉండకపోదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది ఓకే అయినా కాకపోయినా టాలీవుడ్ లో చాలా సీనియర్ హీరోలకు జోడి దొరకడం మహా కష్టంగా ఉన్న టైంలో హానీ రోజ్ మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది కాబట్టి ఇక్కడే సెటిలయ్యే ప్రయత్నాలు చేయొచ్చు

This post was last modified on January 24, 2023 1:37 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago