మొన్న జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య తన తండ్రి పాత జ్ఞాపకాల గురించి మాట్లాడుతూ యథాలాపంగా అన్నారో లేక పొరపాటుగా నోరు జారారో మొత్తానికి అక్కినేని తొక్కినేని అని ప్రాసలో వెళ్లిపోవడం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారి తీసింది. ఏఎన్ఆర్ ఫ్యాన్స్ దీని మీద తీవ్రంగా స్పందించారు. ఇదంతా జరిగి రెండు రోజులు అవుతున్నా బాలకృష్ణ వైపు నుంచి ఎలాంటి క్షమాపణ లేదా సర్దుబాటు మెసేజ్ రాకపోవడంతో ఇది మరింత రభసకు దారి తీసింది. ముఖ్యంగా ఈ కామెంట్ మీద స్పందించాలని అభిమానులు చేసిన ఒత్తిడికి అక్కినేని బ్రదర్స్ చైతు అఖిల్ ట్విట్టర్ ని వేదికగా ఎంచుకున్నారు
చాలా హుందాగా తమ మనసులో మాటను చెప్పారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలని వాళ్ళను అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని చెప్పి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఈ మూడు లైన్లలోనూ మొదటి పేరు ఎన్టీఆర్ పెట్టడం వల్ల గౌరవం విషయంలో ఇక్కడా తగ్గకుండా చూసుకున్నారు. అన్నదమ్ములు ఒకేసారి ఇలా ఒకటే ట్వీట్ పెట్టడం బాగుంది కానీ ఇంకా వారసుడిగా నాగార్జున వైపు నుంచి బదులు రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆయనా ఇదే సందేశాన్ని పెట్టే సూచనలున్నాయి
దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలని సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇంకా పెద్దది చేయడం వల్ల బయట వాళ్లకు ఇదో సెన్సేషనల్ ఇష్యూగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఇటీవలే ఓ వివాదం విషయంలో ఓపెన్ లెటర్ ద్వారా సారీ చెప్పి పెద్దరికం నిలబెట్టుకున్న బాలయ్య ఇప్పుడూ అదే చేస్తే వచ్చే నష్టమేమీ లేదు. పైగా తన తండ్రితో పధ్నాలుగు మల్టీస్టారర్స్ లో నటించిన ఏఎన్ఆర్ గురించి నాలుగు చక్కని మాటలు చెప్పి ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. లాగుతూ పోయేకొద్దీ తాడు తెగుతుందే తప్ప గొడవ ఇంతటితో ఆగదు.
This post was last modified on January 24, 2023 1:35 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…