నిన్నా మొన్నటి దాకా టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరెంటే అయితే పూజా హెగ్డే లేదా రష్మిక మందన్న అంటూ ఈ రెండు పేర్లే గుర్తొచ్చేవి. తాజాగా శ్రీలీల ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ కోసం పరుగులు పెడుతోంది. పెళ్ళి సందD కమర్షియల్ గా వర్కౌట్ కావడంలో, ధమాకా అంత పెద్ద స్థాయిలో వంద కోట్ల గ్రాసర్ గా నిలవడంలో తన పాత్ర ఎంతో ఉందని గుర్తించిన దర్శక నిర్మాతలు భారీ ఆఫర్లతో క్యూ కడుతున్న మాట వాస్తవం. అందం అభినయంతో పాటు యూత్ కి మాస్ కి బాగా కనెక్ట్ అయ్యే చలాకీతనం ఆడియన్స్ ని ఇట్టే ఆకట్టుకుంటోంది. అయితే ఇదే కొన్ని చిక్కులు తెస్తున్నట్టు వినికిడి.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమె ఫ్యాన్స్ ప్రత్యేకంగా తన నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టే మహేష్ శ్రీలీల కాంబోలో ఒక పక్కా ఫోక్ సాంగ్ ని తమన్ తో ట్యూన్ చేయిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ధమాకాలో దండ కడియాల్, పల్సర్ బైక్ పాటలకు వచ్చిన స్పందన చూసి ఒకవేళ ఇదే తరహా ఎనర్జీని సూపర్ స్టార్ తో చూపిస్తే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుని దానికి తగ్గట్టే సెటప్ ని సిద్ధం చేస్తున్నారట. ఆ రేంజ్ లో ఉంది శ్రీలీల మహత్యం.
ఈ కారణంగానే ముందు తనదే మొత్తం ప్రాధాన్యం ఉంటుందని భావించిన పూజా హెగ్డే మారిన స్క్రిప్ట్ లో శ్రీలీల క్యారెక్టర్ కు స్కోప్ పెరగడం చూసి కినుక వహించిందని లీకైన వర్గాల గుసగుస. అయితే వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు బెట్టు చేసి అడిగితే బాగుండదు అందులోనూ క్రేజీ కాంబో మూవీ కాబట్టి ఇంకేమి అనలేక తన సన్నిహితులతో అన్నట్టు వినికిడి. ఇది నిజమో కాదో పక్కనపెడితే తమ సినిమాల్లో శ్రీలీలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విషయంలో దర్శకులు స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. బాలయ్య అనిల్ రావిపూడి కలయికలో రాబోయే చిత్రంలోనూ ఎక్కువ లెన్తే ఇచ్చారని తెలిసింది .
This post was last modified on January 22, 2023 2:00 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…