Movie News

త్రివిక్రమ్ కి టార్గెట్ పెట్టిన జక్కన్న

ఏ ముహూర్తాన మహేష్ , త్రివిక్రమ్ కాంబో ఎనౌన్స్ అయిందో అప్పటి నుండి SSMB28 షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. అన్నీ ప్లాన్ చేసి నాలుగు రోజులు యాక్షన్ సీక్వెన్స్ చేస్తే అది కాస్త త్రివిక్రమ్ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా రాలేదు. దాంతో ఆ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చేయడం , ఆ వెంటనే మహేష్ మదర్ ఇందిరా దేవి , తండ్రి కృష్ణ మరణం పొందటంతో పెద్ద గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది థియేటర్స్ లోకి రావడం కష్టమే అనుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ కి తాజాగా నిర్మాత కూడా గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రకటించినట్లు ఆగస్ట్ 11 కే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని నాగ వంశీ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ అండ్ టీం ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ పెట్టుకునే వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా మహేష్ త్రివిక్రమ్ మీద త్వరగా ఘాట్ కంప్లీట్ చేయాలనే ఒత్తిడి తెస్తున్నాడట. అందుకే అరవై రోజుల పాటు బ్రేక్ లేకుండా షెడ్యూల్ జరిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

దీనికి రీజన్ మహేష్ రాజమౌళితో చేయబోయే పాన్ ఇండియా మూవీ. ఇంత వరకు మహేష్ కారణం చేతే షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఇకపై త్రివిక్రమ్ ఈ సినిమాను టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేయాల్సి ఉంది. ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రాజమౌళి సినిమా కోసం సిక్స్ ప్యాక్ వర్కవుట్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు మహేష్. సుకుమార్ సినిమా కోసం అప్పట్లో మహేష్ సిక్స్ ప్యాక్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి కోసం ఆ లుక్ ట్రై చేయనున్నాడు. ఇప్పటికే రాజమౌళి మహేష్ కి లుక్ పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు. మరి త్రివిక్రమ్ అండ్ టీం మహేష్ పెట్టిన టార్గెట్ రీచ్ అయి ఆగస్ట్ లోపే షూటింగ్ ఫినిష్ చేస్తారా ? వేచి చూడాలి.

This post was last modified on January 18, 2023 8:44 am

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

17 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago