సంక్రాంతి సీజన్ సినిమాల పోటీ పూర్తయింది. చిరు , బాలయ్య ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తూ భారీ వసూళ్లు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు శివరాత్రి పోటీపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి సందర్భంగా దనుష్ ‘సార్ ‘, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ , విశ్వక్ సేన్ ‘ దాస్ కా దమ్కీ’ ప్రకటించారు.
అయితే ఉన్నపళంగా సమంత శివరాత్రి పోటీలో భారీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హటాత్తుగా దిల్ రాజు ‘శాకుంతలం’ సినిమాను శివరాత్రి బరిలో దించాడు. ఫిబ్రవరి 17న రిలీజ్ అంటూ ప్రమోషన్స్ మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు కుర్ర హీరోలు మరో ఆల్టర్నెట్ డేట్ చూసుకునే ప్లానింగ్ లో ఉన్నారట.
దనుష్ ‘సార్’ ఫిబ్రవరి 17నే ‘శాకుంతలం’ తో రావడం పక్కా. కానీ సమంత ఎఫెక్ట్ తో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అలాగే విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’ మార్చ్ కి పోస్ట్ పోన్ కానున్నాయని సమాచారం. దమ్కీ కోసం ఇప్పటికే మార్చి లో ఓ డేట్ చూసుకున్నాడట విశ్వక్. ఇక వినరో భాగ్యము కి సంబందించి కూడా బన్నీ వాస్ మార్చి లో మరో డేట్ ఎంచుకొనున్నాడని తెలుస్తుంది.
ప్రస్తుతానికి ఇంకా కుర్ర హీరోల సినిమాలకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్స్ ఫైనల్ అవ్వలేదు. కానీ ఫిబ్రవరి నుండి మార్చ్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక తెలుగులో దనుష్ సినిమా ఓపెనింగ్ మీద ‘శాకుంతలం’ ఎఫెక్ట్ పడటం ఖాయం. సమంత మీద సింపతీతో కొంత విజువల్స్ కోసం ఇంకొంత ఈ సినిమా చూసేందుకు తెలుగు ఆడియన్స్ మొగ్గు చూపుతారు. పైగా దిల్ రాజు ఈ సినిమాకి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. సో దనుష్ ‘సార్’ కి కూడా తెలుగు స్టేట్స్ లో ఆశించిన థియేటర్స్ దక్కపోవచ్చు.
This post was last modified on January 17, 2023 6:23 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…