అందమైన హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడి.. కళావిహీనంగా తయారైతే అభిమానులు వారిని చూసి తట్టుకోవడం కష్టమే. సోనాలి బింద్రే సహా చాలామంది హీరోయిన్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. దక్షిణాది హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఈ మలయాళ భామ తెలుగులో ఒక టైంలో వరుసగా క్రేజీ సినిమాల్లో నటించింది.
కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. ఆమె క్యాన్సర్ బారిన పడి సినిమాలకు దూరమైంది. అదృష్టం కొద్దీ ఆ మహమ్మారి నుంచి కొంచెం త్వరగానే కోలుకుంది. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నపుడు మీడియా దృష్టిలో పడకుండా ఉన్న ఆమె.. మళ్లీ మామూలు మనిషయ్యాక లైమ్ లైట్లోకి వచ్చింది. తిరిగి సినిమాల్లో కూడా నటించింది. మళ్లీ ఆమెను మునుపటి గ్లోతో చూడడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది.
కానీ ఇప్పుడు మమత మళ్లీ ఓ వ్యాధి బారిన పడింది. ఈసారి సమస్య మరీ పెద్దది కాదు కానీ.. మమతను బాగా ఇబ్బంది పెడుతున్నదే. ఒక చర్మ సంబంధిత సమస్య కారణంగా శరీరమంతా పొడిబారిపోయి.. తెల్లటి మచ్చలు వచ్చేస్తున్నాయట. మామూలుగా హీరోయిన్లకు ఇలాంటి సమస్య ఎదురైతే బయటికి చెప్పుకోరు. కానీ మమత మాత్రం ఒంటి మీద తెల్లటి మచ్చలతో కళ తప్పిన తన బాడీని చూపించడానికి వెనుకాడలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను షేర్ చేసి.. సమస్య గురించి చెప్పేసింది.
ఎండ తగలడం కోసం ఆరుబయట కూర్చున్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘ఓ సూర్యుడా.. నాకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నీ కాంతి అవసరం. నేను నా రంగును కోల్పోతున్నా. నేను ప్రతి రోజూ నీ కోసం ఎదురు చూస్తుంటా. సూర్యకిరణాలు తాకాలని బయటికి వస్తున్నా. ఇప్పుడు నాకు నీ అవసరం చాలా ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నా. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొంది.
ప్రస్తుతం తన సమస్యకు చికిత్స తీసుకుంటున్న మమత.. క్యాన్సర్‌ను జయించినట్లే ఈ వ్యాధినీ అధిగమిస్తుందని ఆశిద్దాం.
This post was last modified on January 16, 2023 12:46 pm
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…