ఇటు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’తో.. అటు హిందీలో దాని రీమేక్ ‘కబీర్ సింగ్’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అతడి తర్వాతి సినిమా కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘అర్జున్ రెడ్డి’ విడుదలై మూడేళ్లు అయిపోవడంతో మళ్లీ తెలుగులో ఎప్పుడు సినిమా తీస్తాడా అని ఇక్కడి వాళ్లు చూస్తున్నారు.
‘కబీర్ సింగ్’ తర్వాత బాలీవుడ్లోనే సినిమా చేయడానికి సిద్ధమైన సందీప్ అక్కడి వాళ్లలోనూ క్యూరియాసిటీ పెంచాడు. కొన్ని నెలల కిందటే తన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటన కూడా వచ్చింది. ‘కబీర్ సింగ్’ నిర్మాతలే అతడి తర్వాతి చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. ఇందులో హీరో ఎవరన్నది ప్రకటించలేదు. రణబీర్ కపూర్ పేరు వినిపించింది. ఇక ప్రకటనే తరువాయి అనుకున్నారు.
కానీ కరోనా దెబ్బకు మొత్తం పరిస్థితి తలకిందులైంది. చేతిలో ఉన్న ప్రాజెక్టులే చాలా ఆలస్యం అవుతుండటంతో రణబీర్.. వెంటనే సందీప్ రాబోయే ఏడాది కాలంలో సందీప్ సినిమాను మొదలుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వెంటనే మరే హీరో కూడా సందీప్‌తో సినిమా చేసే అవకాశం లేదు. దీంతో ఆల్రెడీ కమిటైన సినిమాను హోల్డ్‌లో పెట్టాడట సందీప్.
ఆ సినిమా సంగతి ఏమవుతుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఓ వెబ్ సిరీస్ చేయడానికి అతను సిద్ధమయ్యాడట. ఓ స్టార్ హీరోయిన్‌తో బోల్డ్‌గా సాగే ఓ సిరీస్ చేయబోతున్నాడట సందీప్. ఇందుకు స్క్రిప్ట్, ఇతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే ఈ సిరీస్ పట్టాలెక్కుతుందని సమాచారం. మరి ఈ సిరీస్, తర్వాత బాలీవుడ్ సినిమా పూర్తి చేసుకుని మళ్లీ సందీప్ టాలీవుడ్‌లోకి ఎప్పుడు పునరాగమనం చేస్తాడో?
This post was last modified on July 20, 2020 4:01 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…