వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి పండక్కి రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా. చిరంజీవి రెండో ఇన్నింగ్స్‌లో బెస్ట్ టైటిల్‌తో వచ్చిన సినిమాగా దీన్ని చెప్పొచ్చు. చాలా క్యాచీగా ఉండే టైటిల్ పెట్టాడు చిరు అభిమాని అయిన దర్శకుడు బాబీ. మాస్‌లోకి ఈ టైటిల్ చాలా ఈజీగా వెళ్లిపోయింది. సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచింది.
ఐతే ఈ రోజుల్లో వీరయ్య అనే పాత కలం పేరుతో ఓ పెద్ద హీరో సినిమా చేయడం అరుదే. మరి పర్టికులర్‌గా హీరో పేరును ఇలా పెట్టడానికి కారణం ఏంటి అంటే.. దీని వెనుక ఆసక్తికర కథ ఉందని చెప్పాడు బాబీ. వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో భాగంగా మీడియా ఇంటర్వ్యూల్లో బాబీ ఈ విషయం వెల్లడించాడు.
వెంకీ మామ షూటింగ్ జరుగుతున్నపుడు అందులో ముఖ్య పాత్ర పోషించిన నాజర్ గారు నాకో పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే క్యారెక్టర్ పేరు నన్నెంతో ఆకట్టుకుంది. అప్పుడే ఆ టైటిల్‌తో సినిమా చేయాలని నా టీంతో చెప్పాను.
ఇదిలా ఉంటే చిరంజీవి గారికి వీరయ్య అనే పేరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన సినిమాల్లోకి రాకముందు చిరంజీవి గారి నాన్నగారి సహోద్యోగి అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ 500 రూపాయలిచ్చి ఫొటో షూట్ చేయించారట. ఆ ఫొటోలు పట్టుకునే చిరంజీవి గారు మద్రాస్‌కు వెళ్లారు. ఆ కానిస్టేబుల్ పేరు వీరయ్య అని నాకు తెలిసింది. అది నోస్టాల్జిక్‌గా అనిపించి, నేను అప్పటికే ఫిక్సయిన వీరయ్య టైటిల్‌తోనే చిరంజీవి గారితో సినిమా చేయాలని ఫిక్సయ్యాను. చిరంజీవి గారికి కూడా ఈ టైటిల్ బాగా నచ్చింది. సినిమా కథ వాల్తేరు చుట్టూ తిరుగుతుంది కాబట్టి దాన్ని కూడా టైటిల్లో యాడ్ చేశాం. ఒక అభిమానిగా, మాస్ ప్రేక్షకులు చిరంజీవి గారి నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దాను. కచ్చితంగా అభిమానుల అంచనాలను అందుకుంటా అని బాబీ తెలిపాడు.
This post was last modified on January 7, 2023 8:58 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…