యాభై సినిమాల నిర్మాణానికి అతి దగ్గరగా ఉన్న దిల్ రాజు గారి అనుభవం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాతగా పక్కనపెడితే డిస్ట్రిబ్యూటర్ గా ఆయనకున్న సుదీర్ఘ అనుభవం ఇప్పుడున్న టాప్ ప్రొడ్యూసర్లలో చాలా మందికి లేదన్నది వాస్తవం. అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా తమిళ బిగ్గెస్ట్ స్టార్ హీరో విజయ్ తో మొదటిసారి తీసిన వరిసు అలియాస్ వారసుడు గురించి వస్తున్న వార్తలు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓవర్సీస్ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ కంటెంట్ ఇంకా చేరలేదని ఎప్పుడు అందుతుందో తెలియని కారణంగా అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టలేదనే వార్త ట్విట్టర్ ని ఊపేస్తోంది.
పక్కా ప్లానింగ్ తో అన్నీ టైం ప్రకారం చేసే రాజుగారు ఎక్కడో పొరపాటు చేసుంటారని అనుకోలేం. పైగా థియేటర్ పంపకాల విషయంలో తనే కేంద్ర బిందువుగా మారిన తరుణంలో ఏ చిన్న తప్పు జరిగినా దానికి భారీ మూల్యం ఉంటుందని తెలుసు. కాబట్టి ప్రతి క్షణం అలెర్ట్ గా ఉంటూ అన్నీ సవ్యంగా జరిగేలా చూసుకుంటారు. తాజాగా వారసుడుకి రిలీజ్ చేసిన నైజాం లిస్టు ఉన్న ప్రకటనలో డేట్ లేకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. సదరు ఎగ్జిబిటర్లు సైతం దీని గురించి ఏమీ చెప్పేలేకపోతున్నారు. అంటే తెరవెనుక బయట కనిపించని ఏదో వ్యవహారం నడుస్తున్న మాట నిజమే.
ప్రస్తుతం ఎస్విసి బృందం దీన్ని పరిష్కరించే పనిలో ఉంది. 11న వరిసు వచ్చేసి ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వారసుడు వచ్చినా పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే బుధవారం వచ్చే సోలో అడ్వాంటేజ్ పోగొట్టుకుని తెగింపుకి ఫ్రీ రోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు ఆన్ లైన్ రివ్యూలు పైరసీ బెడదలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి రెండు వెర్షన్లు రిలీజ్ చేయడం అవసరం. యుఎస్ లో బుకింగ్స్ స్టార్ట్ చేస్తే తప్ప ఖరారుగా ఏదీ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఈ పనుల ఒత్తిడిలో ఉన్న దిల్ రాజు మీడియాకు అందుబాటులో లేరు. ఒకటి రెండు రోజుల్లో ఈ అయోమయాన్ని కుండబద్దలు కొట్టేయడం ఇప్పుడు అత్యవసరం.
This post was last modified on January 7, 2023 4:09 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…