Movie News

ధమాకా టాలెంట్ ఇకనైనా వాడాలి

స్టార్ హీరోలకు అయితే తమన్ లేదంటే దేవిశ్రీప్రసాద్ అనే రెండే ఆప్షన్లతో టాలీవుడ్ సంగీత దర్శకుల కొరతతో ఎంతగా అల్లాడిపోతోందో చూస్తూనే ఉన్నాం. అనూప్ లాంటి ఇంకొందరు ఉన్నారు కానీ బడా సినిమాలను మోసే రేంజ్ లో ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ధమాకా రూపంలో భీమ్స్ సెసిరోలియో ఇచ్చిన పాటలు ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించాయో వసూళ్ల సాక్షిగా యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ ప్రూఫ్ గా కళ్ళముందు కనిపిస్తూనే ఉంది. గతంలో ఇదే రవితేజకు భీమ్స్ 2015లో బెంగాల్ టైగర్ కు స్కోర్ కంపోజ్ చేసినప్పుడు రాని పేరు ఏడేళ్ల తర్వాత దక్కడమంటే విశేషమే.

ధమాకా సక్సెస్ లో శ్రీలీల గ్లామర్ తర్వాత అంతగా దోహదపడింది జింతాక జింతాక, దండకడియాల్ పాటలే. సెకండ్ హాఫ్ లో వచ్చే పల్సర్ బైక్ సాంగ్ ఒరిజినల్ ట్యూన్ కాకపోయినా దాన్ని రీమిక్స్ చేసిన తీరు చిత్రీకరించిన విధానం మాస్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది. విడుదలకు ముందు ఈవెంట్ లో మాస్ మహారాజా ప్రత్యేకంగా ఇతని గురించి చెప్పడం విని అందరూ మాములే అనుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అతని ప్రతిభను నమ్మినందుకు తగిన ఫలితం దక్కింది. 2012లో నువ్వా నేనాతో డెబ్యూ చేసిన భీమ్స్ కి చెప్పుకోదగ్గ బ్రేక్ దశాబ్దం తర్వాత దొరకడం విశేషం.

రవితేజ నెక్స్ట్ మూవీ రావణాసురలోనూ హర్షవర్ధన్ తో కలిసి భీమ్స్ పాటలు ఇవ్వబోతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్ కి రిపీట్ అనిపించే ఆల్బమ్స్ రావడం చాలా తగ్గింది. ధమాకా ఇంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం కామెడీతో పాటు స్క్రీన్ మీద పేలిపోయిన పాటలే. ఒకవేళ శ్రీలీల బదులు మరో హీరోయిన్, భీమ్స్ స్థానంలో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా అవుట్ ఫుట్ లో తేడా వచ్చింది. కేవలం రవితేజ ఎనర్జీనే సినిమాలను నిలబెట్టాదని ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రుజువు చేసాయిగా. భీమ్స్ ఇదే టెంపోని కొనసాగిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ప్రతి ఆల్బమ్ అంచనాలకు తగ్గట్టు ఇస్తేనే సుమా.

This post was last modified on January 5, 2023 11:02 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

1 hour ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago