Movie News

దోబూచులాడుతున్న అజిత్ విజయ్

తమిళనాట సంక్రాంతి సినిమాల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వకపోవడమే దీనికి కారణం. వారసుడు జనవరి 12 అని ముందు నుంచి ప్రచారం జరిగినట్టే ఆ మధ్య పోస్టర్లు వచ్చాయి కానీ రీసెంట్ గా వచ్చినవాటిలో దాన్ని తీసేసి కేవలం పొంగల్ 2023 అని పెట్టారు. ఇక అజిత్ తెగింపు గురించి నిర్మాత బోనీ కపూర్ చాలా గుట్టుని మైంటైన్ చేస్తున్నారు. ఒక రోజు ముందు అంటే 11న రావాలని ఆయన ప్లాన్. కానీ విజయ్ ఫ్యాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. ఇది వాళ్లకు సంబంధం లేని విషయమే అయినా తమ హీరో ఓపెనింగ్స్ రికార్డులు పోతాయని టెన్షన్.

డిస్ట్రిబ్యూటర్లకు డబ్బింగ్ హక్కులు కొన్న ఇతర ప్రొడ్యూసర్లకు ప్రస్తుతానికి 11 అని చెప్పి ఉంచారు కానీ చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే తప్ప దాదాపు లాక్ అయినట్టే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రెండింటికి ఏమంత భీభత్సంగా లేకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోవడంతో బజ్ పెరిగేలా ప్రమోషన్లు పెంచాలని అజిత్ విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. చేతిలో కేవలం ఒక వారం మాత్రమే సమయం ఉండటంతో ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

తమిళంలోనే అలా ఉంటే తెగింపుకి ఇక్కడ కనీస హైప్ లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. తక్కువ థియేటర్లు అయినా సరే ఒకే రోజు రెండు వెర్షన్లు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. మరోవైపు తమిళనాడులో పొంగల్ మూవీస్ హడావిడి ఓ రేంజ్ లో జరుగుతోంది. థియేటర్లను ఇప్పటి నుంచే బ్యానర్లు డెకరేషన్లతో సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఏ రేంజ్ లో వార్ ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పుడది ఇంకా ముదరబోతోంది. తనకే సంఘాలు లేవని అజిత్ పలుమార్లు తేల్చి చెప్పినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం గొడవలు పడుతూనే ఉంటారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో తెగింపుని ఎమోషనల్ డ్రామాగా వారసుడుని తెరకెక్కించారు

This post was last modified on January 4, 2023 1:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago