మొన్నటి వరకు బాలయ్య వారసుడు, తారక రామరావు గారి మనవడు మోక్షజ్ఞ పెద్దగా కనిపించింది లేదు. ‘లెజెండ్’ ఘాట్ టైమ్ లో మోక్షజ్ఞ ఫోటోస్ బయటికి వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో బైక్ మీద కూర్చున్న అవే ఫోటోస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ తాజాగా మోక్షజ్ఞ ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు. తమ కుటుంబం కోసం వేసుకునే స్పెషల్ షోలకు తండ్రితో పాటు వస్తున్నాడు. ఇటీవలే ఆహా అన్ స్టాపబుల్ షోలో పవన్ ఎపిసోడ్ లో కూడా మోక్షజ్ఞ ఉన్నాడని చెప్తున్నారు.
తాజాగా ‘వీర సింహా రెడ్డి’ మేకింగ్ వీడియో లో తండ్రితో కలిసి మోక్షజ్ఞ కనిపించాడు. ఇక మొన్నటి వరకు బయట అస్సలు కనబడని నందమూరి మోక్షజ్ఞ ప్రస్తుతం సినిమాలకు అలాగే షూటింగ్స్ కి హాజరవ్వడంలో బాలయ్య ముందస్తు ప్లాన్ కనిపిస్తుంది. ఈ ఏడాదిలోనే తనయుడి ఎంట్రీకి అంతా సిద్దం చేస్తున్నాడు బాలయ్య. అందులో భాగంగానే మోక్షజ్ఞ ను షూటింగ్స్ కి పిలుస్తున్నాడని తెలుస్తుంది.
అంతా అనుకున్నట్లు జరిగితే బాలయ్య ను తన తండ్రి పరిచయం చేసినట్టే మోక్షజ్ఞ ను బాలయ్య దర్శకత్వంలో పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదిత్య 999 మ్యాక్స్ ప్రాజెక్ట్ ను తన దర్శకత్వం కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు బాలయ్య. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఏదేమైనా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి బాలకృష్ణ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 3, 2023 4:33 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…