2021 లో చాలా తక్కువ సినిమాలు రిలీజయ్యాయి. అందులో బాలయ్య ‘అఖండ’ , బన్నీ ‘పుష్ప’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో గట్టి సౌండ్ చేశాయి. కోవిడ సెకండ్ వేవ్ తర్వాత భారీ విజయాలు అందుకున్న ఈ ఇద్దరి నుండి సినిమా రాలేదు. స్టార్ హీరోలంతా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. అయితే బాలయ్య -గోపీచంద్ మాలినేని కాంబో సినిమా ఈ ఇయర్ దసరా రిలీజ్ అనుకునే మొదలు పెట్టారు. కానీ కుదరలేదు.
ఆ తర్వాత డిసెంబర్ లో అఖండ రిలీజ్ సెంటిమెంట్ తో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు అది కూడా పనవ్వలేదు. ఇక చేసేదేం లేక ఫైనల్ గా సంక్రాంతి సీజన్ లో వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నారు.సో అంతా అనుకున్నట్టు జరిగితే బాలయ్య నుండి ఈ ఇయర్ గ్యాప్ ఉండేది కాదు. అనుకోకుండా గ్యాప్ వచ్చింది.
‘అల వైకుంఠపురములో’ “గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఈ ఇయర్ అతని కెరీర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యింది. నిజానికి బన్నీ -సుకుమార్ తో పుష్ప సినిమా మాత్రమే అనుకున్నాడు. కానీ మధ్యలో సడెన్ గా రెండు భాగాల ప్లాన్ కారణంగా పుష్ప 1 , పుష్ప 2 గా కథ విడిపోయింది. దీంతో పార్ట్ 1 కి పార్ట్ 2 కి మధ్య బన్నీ ఏడాది గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
పుష్ప 1 విడులై ఏడాది గడిచింది ఇప్పటికీ పార్ట్ 2 ఘాట్ పట్టుమని పది రోజులు కూడా జరగలేదు. వచ్చే ఏడాది జనవరి నుండి పుష్ప 2 ఘాట్ స్పీడప్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఇక సుక్కు మేకింగ్ కారణంగా అల్లు అర్జున్ డైరీలో ఈ ఏడాది పేజీ లేకుండా పోయింది. ఒక స్టార్ హీరో ఇలా ఏడాది గ్యాప్ రావడం అంటే ఫ్యాన్స్ తట్టుకోలేరు. కానీ పుష్ప 1 సక్సెస్ తో బన్నీ ఫ్యాన్స్ ఎంత టైమ్ తీసుకున్నా పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. ఏదేమైనా బాలయ్య , బన్నీ ఈ ఏడాదిని వట్టిగా వదిలేసి షూటింగ్స్ తోనే సరిపెట్టుకున్నారు.
This post was last modified on December 31, 2022 11:18 pm
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…